hyderabadupdates.com Gallery టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న స్థానంలో తాత్కాలికంగా సీఎంఓలో విధులు నిర్వ‌హిస్తున్న ముద్దాడ ర‌విచంద్ర‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా తిరుమ‌ల‌లో ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంపై సుదీర్ఘంగా విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో సిట్ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకంగా నివేదిక అంద‌జేసింది. ఆనాడు జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఈవోగా ప‌ని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ పైనా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసింది.
దీని కార‌ణంగా త‌న‌పై బ‌దిలీ వేటు వేసిన‌ట్లు స‌మాచారం ప్ర‌ధానంగా క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఆనాడు టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కార‌ణ‌మ‌ని, త‌న హ‌యాంలోనే నెయ్యి సేక‌ర‌ణ విధానంలో తీసుకు వ‌చ్చిన మార్పులే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన‌ట్లు నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం. ఆనాడు టీటీడీకి ఈవోగా సింఘాల్ ఉన్నారు. త‌న ప్ర‌మేయం లేకుండా ఎలా జ‌రుగుతుంద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించక పోవడం లేక గుర్తించినా చూసీ చూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్‌ ఆక్షేపించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈవోతో పాటు చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలాజీపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసింది.
The post టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్

    నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్‌రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేశ్‌ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ‘‘ఏప్రిల్‌లో

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర

23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.