hyderabadupdates.com movies విశ్వక్… మరకలు చెరిపేందుకు మంచి ఛాన్స్

విశ్వక్… మరకలు చెరిపేందుకు మంచి ఛాన్స్

పోయినేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు నుంచి ఒక కళాఖండం రిలీజైంది. దాని పేరు.. లైలా. మన దగ్గర డిజాస్టర్లు కొత్తేమీ కాదు. ఏటా ఎన్నో సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందుకుంటూ ఉంటాయి. కానీ చూసిన ప్రతి ప్రేక్షకుడూ ‘వరస్ట్’ అంటూ తిట్టిపోసే సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే ‘లైలా’.

థియేటర్లో చివరి వరకు కూర్చోవడం కూడా కష్టమై, ఈ సినిమా తీసిన వాళ్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేక్షకులు. రివ్యూలు, రేటింగ్స్ అయితే మరీ ఘోరం. ఈ సినిమా చేసి తనకున్న పేరును బాగా చెడగొట్టుకున్నాడు విశ్వక్సేన్. తన తల్లే ఈ సినిమా చూసి తనపై జాలిపడిందంటూ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ చెప్పాడంటే.. ఇది ఏ రేంజ్ డిజాస్టర్ అన్నది అర్థం చేసుకోవచ్చు.

ఐతే విశేషం ఏంటంటే.. ఏడాది తర్వాత, మళ్లీ ప్రేమికుల దినోత్సవం సమయానికే విశ్వక్సేన్ తిరిగి బాక్సాఫీస్ వేటకు సిద్ధమయ్యాడు. ఈసారి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి అతను చేసిన ‘ఫంకీ’ వేలంటైన్ డే వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రోమోలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. అనుదీప్ మార్కు వినోదానికి ఢోకా లేనట్లే ఉంది.

ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాాలీవుడ్ బాక్సాఫీస్‌ డల్ అయిపోయింది. గత వారం, ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. వస్తున్న సినిమాలకు బజ్ తక్కువగానే ఉంది. ఈ వీకెండ్లో పేరుకు డజను సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టంగానే ఉంది.

గుణశేఖర్ మూవీ ‘యుఫోరియా’ ఏమైనా మ్యాజిక్ చేస్తే చెయ్యాలి. ప్రస్తుతానికి చూస్తుంటే ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించే సినిమా ‘ఫంకీ’నే అయ్యేలా ఉంది. సినిమాకు టాక్ బాగుంటే మంచి హిట్టయి.. గత వేలంటైన్స్ డేకి ‘లైలా’తో పడ్డ మరకలను విశ్వక్ చెరిపేయడానికి అవకాశముంటుంది.

Related Post

మోడీ కోసం బాబు… రంగంలోకి దిగిపోయారు!మోడీ కోసం బాబు… రంగంలోకి దిగిపోయారు!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్న సీఎం చంద్ర‌బాబు.. అక్క‌డితోనే త‌న ప‌ని అయిపోయింద‌ని భావించ డం లేదు. ఏదేశ‌మేగినా.. ఎందు కాలిడినా.. అన్న‌ట్టుగా ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

‘బంగార్రాజు’ దర్శకుడు ఎక్కడ?‘బంగార్రాజు’ దర్శకుడు ఎక్కడ?

​టాలీవుడ్‌లో అనిల్ రావిపూడికి ఏ స్థాయిలో సంక్రాంతి సెంటిమెంట్, 100% స్ట్రైక్ రేట్ ఉందో, ఒకప్పుడు కళ్యాణ్ కృష్ణ కూరసాల కూడా అదే బాటలో కనిపించారు. అక్కినేని నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నాగచైతన్యకు ‘బంగార్రాజు’ వంటి సాలిడ్ పండగ హిట్స్