hyderabadupdates.com Gallery పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం తీర‌ని అన్యాయం

పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం తీర‌ని అన్యాయం

పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం తీర‌ని అన్యాయం post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-27 పై స్పందించారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి అప్పులు త‌ప్ప ఆదుకునేందుకు ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఏపీ స‌ర్కార్ కు ఎందుకు స‌హాయం చేయ‌లేదో చెప్పాల్సిన అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నించారు. సోయి లేకుండా మౌనంగా ఉంటే ఎలా అని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు.
గ‌త బ‌డ్జెట్ లో ప‌ట్టించు కోని పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో మళ్ళీ పెడచెవిన పెట్టారని మండిప‌డ్డారు. కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకే అని చెప్పకనే చెప్పారు. గత బడ్జెట్ లో ప్రాజెక్ట్ పూర్తికి ఇస్తామని చెప్పిన 12 వేల కోట్లలో ఇచ్చింది 5 వేల కోట్లే. ఈ ఏడాది 3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది అని ప్ర‌శ్నించారు. మిగిలిన నిధుల సంగతి ఏంటి ? 20 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని అన్నారు. కూటమిలో పెద్దన్నగా చెప్పుకొనే చంద్రబాబు గారు నోరు మెదపక పోవడం ఆయన పాలన తీరుకి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.
The post పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం తీర‌ని అన్యాయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమారమ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార

న్యూఢిల్లీ : మ‌హాత్మా గాంధీ మ‌హాశ‌యుడు ఒక్క ఇండియాకే కాద‌ని ఆయ‌న జీవితం యావ‌త్ ప్ర‌పంచానికి స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు అసుర కుమార దిశా నాయ‌క‌. మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క

Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

    ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌