hyderabadupdates.com Gallery టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌

టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌

టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌ post thumbnail image

తిరుమ‌ల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బ‌దిలీ చేసింది. ఆయ‌న కూడా రిలీవ్ అయ్యారు. ఇక ముద్దాడ ర‌విచంద్ర స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ముద్దాడ ర‌విచంద్ర కెరీర్ విష‌యానికి వ‌స్తే త‌ను 1996వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఏపీకి చెంద‌ని సీనియ‌ర్ అధికారి. ఆగ‌స్టు 19, 1972లో పుట్టారు. 24 ఏళ్ల వ‌య‌సులోనే 1995లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. బి.టెక్. (మెకానికల్ ఇంజనీరింగ్) డిగ్రీ పూర్తి చేశారు.
అనేక ముఖ్యమైన పరిపాలనా పదవులను నిర్వహించారు. విశ్లేష‌నాత్మ‌క నైపుణ్యాలు, సాంకేతిక ప‌రిజ్ఞానంపై మంచి ప‌ట్టు ఉంది ముద్దాడ ర‌విచంద్ర‌కు. తొలుత ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు. చిత్తూరు డీపీఏపీ పీడీగా, రంగారెడ్డి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ గా, నెల్లూరు , చిత్తూరు జిల్లాల క‌లెక్ట‌ర్ గా ఉన్నారు. ఏపీహెచ్ఎం ఎండీగా, వైస్ చైర్మ‌న్ గా, తూర్పు గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ గా, ఏపీ కాలుష్య నియంత్ర‌ణ బోర్డు స‌భ్య కార్య‌ద‌ర్శిగా, ఏపీచ్ ఎం ఎండీగా, ఫైనాన్స్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీగా, సామాజిక‌, గిరిజ‌న సంక్షేమ కార్య‌ద‌ర్శిగా, వైద్య‌, ఆరోగ్య ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా, మ‌హిళ‌లు, పిల్ల‌లు, విక‌లాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్ శాఖ‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు ముద్దాడ ర‌విచంద్ర‌. ప్ర‌స్తుతం టీటీడీ ఈవోగా కొలువు తీర‌నున్నారు.
The post టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

తిరుమల : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి,

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

  విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు