hyderabadupdates.com Gallery చేత‌కాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం

చేత‌కాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం

చేత‌కాని సీఎం  తెలంగాణ రాష్ట్రానికి శాపం post thumbnail image

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు ఎలాంటి కేటాయింపులు లేక పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళుతున్న సీఎం ఏం చేశారో చెప్పాల‌న్నారు. సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా – మిగిలింది మొండి చెయ్యి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతకాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ దౌర్భాగ్యం కాక మ‌రేమిట‌ని ప్ర‌శ్నించారు . బడాభాయ్ తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన ఛోటాభాయ్ మాటలన్నీ బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలి పోయిందంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
రేవంత్ చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మోసేందుకు, బీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న ముఖ్యమంత్రి స్కాములపై విచారణ జరపకుండా కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునేందుకేనని మరోసారి రుజువైంద‌ని అన్నారు. రాష్ట్రం నుంచి పేరుకు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగక పోవడం వల్లే తెలంగాణకు చిల్లి గవ్వ కూడా కేంద్ర బడ్జెట్ లో దక్కలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తోపాటు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన చెరో ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు ? మీ సొంత పైరవీల కోసమా మిమల్ని తెలంగాణ ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపించింది ? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
The post చేత‌కాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Chandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలుChandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలు

    కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7