hyderabadupdates.com Gallery అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనే

అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనే

అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనే post thumbnail image

హైద‌రాబాద్ : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల‌పై ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి గ‌తంలో విజ‌య‌వంత‌మైన ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో న‌టించారు. ఈ ఇద్ద‌రి పెయిర్ కు మంచి మార్కులు ప‌డ్డాయి. మ‌రోసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి ర‌ణ‌బ‌లి మూవీలో న‌టిస్తున్నారు. వీరిని తెర‌పై చూసేందుకు విజ‌య్, ర‌ష్మిక అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. తాజాగా న‌టించిన మూవీ ర‌ణ బ‌లి సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్, ఫోటోలు క‌లక‌లం రేపుతున్నాయి. అంత‌కు ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు క‌లిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో న‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య‌నే ఈ ఇద్ద‌రూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో ఉద‌య్ పూర్ వేదిక‌గా ఒక్క‌టి కాబోతున్నారు. అద్భుత‌మైన ప్యాలెస్ కూడా ఇప్పటికే బుక్ చేశారు. సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌రు కానున్న‌ట్లు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు ప్యాలెస్ అలంక‌ర‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 28న విజ‌య్, ర‌ష్మిక మంద‌న్నాలు ఒక్క‌టి కాబోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ కెమిస్ట్రీ 2018 నుంచి ప్రారంభ‌మైన‌ట్లు స‌మాచారం. మొత్తం మీద నేష‌న‌ల్ క్ర‌ష్ రౌడీల మ‌ధ్య ప్రేమాయ‌ణం చివ‌ర‌కు శాశ్వ‌త బంధానికి దారి తీయ‌డం విశేషం.
The post అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పున‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా

Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !

Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. గురువారం

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబుCM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

  విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14,