hyderabadupdates.com movies దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే ఉంది. ఇద్దరూ పరస్పర నమ్మకంతో పని చేస్తుంటారు. నాగవంశీ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌‌తో పాటు అతడి బాబాయి చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో నిర్మించే సినిమాలను చాలా ఏళ్ల నుంచి నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజే పంపిణీ చేస్తూ వస్తున్నారు.

రాజు గురించి నాగవంశీ, నాగవంశీ గురించి దిల్ రాజు ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుంటారు.సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ఇద్దరూ పరస్పర సహకారంతో సాగుతుంటారు. సినిమాకు మంచి లాభం వస్తే నిర్మాతకు పంచడంలో, అలాగే నష్టం వస్తే తమకు భర్తీ చేయడంలో అండర్‌స్టాండింగ్‌తో ఉంటామని దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ మీట్లో.. నాగవంశీ తనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడని దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగవంశీ సైతం రాజుకు ఎప్పుడూ మంచి ఎలివేషనే ఇస్తుంటాడు.

ఇలాంటి అనుబంధం ఉన్న వ్యక్తుల మధ్య ఇప్పుడు బ్రేక్ రావడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ నైజాంలో తన సినిమాల పంపిణీని రాజుకే అప్పగించే నాగవంశీ.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాడు. తమ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొన్నిసినిమాల హక్కులను అక్కినేని నాగార్జున సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌కు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ముందుగా వచ్చే శుక్రవారం రిలీజయ్యే ‘ఫంకీ’ సినిమాను అన్నపూర్ణ సంస్థలో రిలీజ్ చేయిస్తున్నాడు నాగవంశీ. ఆ తర్వాత ‘బేబి’ కాంబినేషన్లో నిర్మిస్తున్న ‘ఎపిక్’ సినిమా హక్కులనూ నాగ్ సంస్థకే కట్టాబెట్టాడట.

అంతే కాక హారిక అండ్ హాసిని సంస్థలో, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ను సైతం నాగార్జునే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఆయా సినిమా డిమాండును బట్టి నిర్మాతలు ఎక్కువ రేటు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తుంటారు. కానీ కొందరు మాత్రం కొన్ని ఏరియాల్లో ఒకే డిస్ట్రిబ్యూటర్‌తో కొనసాగుతుంటారు.

రాజు, నాగవంశీలది అలాంటి బలమైన బంధమే. మరి దాన్ని బ్రేక్ చేసి నాగార్జునకు తమ కొత్త సినిమాల హక్కులు ఇచ్చారంటే రాజుతో నాగవంశీకి చెడిందా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి.. ఇంతకుముందు పంపిణీ చేసిన సినిమాల లెక్కల్లో ఏమైనా తేడాలు వచ్చాయా అనే చర్చ జరుగుతోంది.

Related Post

తాగేసి రూ.10కోట్ల కారుతో వ్యాపారి కొడుకు ఆరాచకం…తాగేసి రూ.10కోట్ల కారుతో వ్యాపారి కొడుకు ఆరాచకం…

బలుపు చేష్టలు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడో వ్యాపారి కొడుకు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటమే కాదు.. అమాయకుల ప్రాణాల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన తీరును చూస్తే నోట మాట

“Ramya Krishna as Sivagami Was Pure Destiny”: Producer Shobu Yarlagadda“Ramya Krishna as Sivagami Was Pure Destiny”: Producer Shobu Yarlagadda

Producer Shobu Yarlagadda, one of the creative forces behind the iconic Baahubali franchise, recently shared his thoughts about actress Ramya Krishna’s unforgettable portrayal of Sivagami. Speaking in a TV show,