hyderabadupdates.com Gallery కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం post thumbnail image

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో యాత్ర‌కు అనంత‌పురం జిల్లా నుంచి శ్రీ‌కారం చుట్టారు. భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు. ఇవాళ మూడోరోజుకు చేరుకుంది యాత్ర‌. మన్రేగా పరిరక్షణ యాత్రలో భాగంగా సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పునరుద్ధరించాలని ఏపీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. వీబీ గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. గ్రామ్ జి చట్టం పేదల పొట్ట కొట్టే చట్టమని, 125 రోజులు పని కల్పిస్తామని చెప్పే కేంద్రం మాటలు పచ్చి బూటకమని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. తాము చేప‌ట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మానికి అడుగ‌డుగునా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కొత్తచెరువు మండల ప్రజల నుంచి స్పంద‌న రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్‌. రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని, కేవ‌లం ప్ర‌చారం త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు.
The post కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్

హైద‌రాబాద్ : సంక్రాంతి ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోనుఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున

జ‌పాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్జ‌పాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్

ఖ‌మ్మం జిల్లా : జపాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్ ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఆయా దేశాల‌కు సంంధించిన భాష‌ల‌ను న‌ర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థినుల‌కు నేర్పిస్తామ‌ని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం