hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను

సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను

సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను post thumbnail image

ముంబై : భార‌త క్రికెట్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మంగ‌ళ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. అంద‌రూ త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని కానీ త‌న కెరీర్ లో గొప్ప ప్లేయ‌ర్ అని పేర్కొన్నాడు. ప్ర‌త్యేకంగా త‌న‌కు బేష‌ర‌తుగా మ‌ద్దతు ఇచ్చిన విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2023 వేలంలో నేను అమ్ముడు పోనప్పుడు, నా కెరీర్‌లో అత్యంత కష్టకాలంలో ఉన్నానని తెలిపాడు. సరిగ్గా అప్పుడే సంజు శాంసన్ నాకు ఫోన్ చేశాడని అన్నాడు. ఆ స‌మ‌యం లో చాలా నిరాశగా ఉన్నప్పుడు, అతను ఎంతో సానుకూలంగా మాట్లాడాడని చెప్పాడు సందీప్ శ‌ర్మ‌.
నేను అమ్ముడు పోక పోవడం చూసి తనకు నిజంగా బాధ కలిగిందని చెప్పాడు . మ‌రో వైపు గాయాలు ఆటలో భాగమేనని నాకు గుర్తు చేశాడని తెలిపాడు. తాను ఈ ఐపీఎల్‌లో ఆడతానని, బాగా రాణిస్తానని సంజూ శాంస‌న్ త‌న‌కు హామీ ఇచ్చాడని పేర్కొన్నాడు సందీప్ శ‌ర్మ‌. ఆ సమయంలో భారీ నమ్మకంతో నన్ను పలకరించిన ఏకైక వ్యక్తి శాంస‌న్ మాత్ర‌మేన‌ని , ఇంకే ఏ ఆట‌గాడు త‌న‌ను ప‌ల‌క‌రించ‌లేద‌ని వాపోయాడు. కేవలం పైపై మాటల ప్రోత్సాహం కాదు, అతను చెప్పిన ప్రతి మాటను మనస్ఫూర్తిగా ఆచ‌ర‌ణ‌లో పెట్టాడ‌న్నారు. కష్టకాలంలో తోడుగా నిలబడే నిజమైన స్నేహితుడు ఎలాంటివాడో అప్పుడు నాకు తెలిసిందని చెప్పాడు సందీప్ శ‌ర్మ‌. ఆ వెంట‌నే త‌ను న‌న్ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ క్యాంప్ కు పిలిపించాడ‌ని, ప్ర‌సిద్ద్ క్రిష్ణ గాయ‌ప‌డ‌డంతో నాకు ఛాన్స్ ద‌క్కింద‌న్నాడు .
The post సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి కీల‌క కామెంట్స్రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి కీల‌క కామెంట్స్

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సురక్షిత ఓట‌రు న‌మోదుకు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్నికల అధికారులు అనుసరించే ఆచరణాత్మక విధానాలను వివరించారు, ఆన్‌లైన్ ఓటరు-లుకప్ సేవలు, నియంత్రిత-యాక్సెస్ కియోస్క్‌లు ,