hyderabadupdates.com movies సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తను రాసిన కథలను చిన్న బడ్జెట్ లో ప్రతిభ గల దర్శకులతో చేస్తుంటాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలకే కాదు నిర్మించిన సినిమాలకు కూడా ఒక బ్రాండ్ ఏర్పడేలా చేసుకున్నాడు. కుమారి 21f, దర్శకుడు లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చాయి.

దర్శకుడిగా పుష్ప కోసం ఐదేళ్లు బిజీ అయిపోయిన సుకుమార్ ఆ సినిమా పనుల్లో పడి సుకుమార్ రైటింగ్స్ ని పక్కన పెట్టాడు. సుకుమార్ రైటింగ్స్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఒక సెటాఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. 2022 లో సుకుమార్ రైటింగ్స్ నుంచి 18 పేజెస్ మూవీ వచ్చింది. ఆ తర్వాత విరూపాక్ష కూడా అదే బ్యానర్ కో ప్రొడ్యూస్ చేసింది.

తనకు వచ్చిన ఆలోచనలను కథగా మార్చి సుకుమార్ తన అసిస్టెంట్ లతో సినిమాలు చేయిస్తాడు. నిర్మాతగా సుకుమార్ కి ఒకప్పుడు ఉన్నంత టైం ఇప్పుడు లేదు. పుష్ప రెండు భాగాలు పాన్ ఇండియా సక్సెస్ అవ్వడంతో అతని డైరెక్షన్ లో సినిమా కోసం నేషనల్ లెవెల్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో మరో కథలను ఆలోచించే తీరిక లేదు. అందుకే సుకుమార్ రైటింగ్స్ నుంచి కొత్త సినిమాల అప్డేట్ రావట్లేదు.

మరోపక్క సుకుమార్ తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలకే సుకుమార్ రైటింగ్స్ కో ప్రొడక్షన్ గా ఉంటున్నాడు. రెమ్యునరేషన్ అడ్జెస్ట్ మెంట్ లో తను తీసుకోకుండా బిజినెస్ లో షేరింగ్ లాంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఐతే సుకుమార్ పెన్ నుంచి పుష్ప లాంటి భారీ సినిమాలే కాదు కుమారి 21f లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ని కూడా ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఐతే ఆ ఆడియన్స్ కి ఇప్పుడప్పుడే సుకుమార్ నుంచి అలాంటి అప్డేట్ వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది.

సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాకు కథా చర్చల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందట. పెద్ది రిలీజ్ అవ్వడమే ఆలస్యం RC17ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా సుకుమార్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

Related Post

భర్తకు బెయిల్ ఇప్పించి మరీ…భర్తకు బెయిల్ ఇప్పించి మరీ…

​ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో ఒక మహిళ చేసిన కిరాతకం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చి మరీ కిరాయి హంతకులతో హత్య చేయించింది. ప్రియుడి వ్యామోహంలో

చంద్ర‌బాబుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నిజమెంత?చంద్ర‌బాబుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నిజమెంత?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు మాట‌లు విని.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు అన్యాయం చేసింద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌.. ప్ర‌ధానంగా పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్లు చేశారు. పాల‌మూరులో చెరువుల‌ను