hyderabadupdates.com movies స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరగగా ఫిబ్రవరి అనుకున్న విడుదల ఏప్రిల్ కు వెళ్లిపోవడంతో ప్రమోషన్లకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే దాని మీద టీమ్ మల్లగుల్లాలు పడుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు భరత్ కృష్ణమాచారికి ఇమేజ్, బ్రాండ్ లేకపోయినా టీజర్ విజువల్స్ తోనే ఆడియన్స్ దృష్టి పడేలా చేసుకున్నారు. దీంతో సహజంగా అంచనాలు రేగడం మొదలయ్యాయి. కాకపోతే వీటిని పెంచాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది.

రాబోయే రోజుల్లో ప్రమోషన్లు, పోటీ పరంగా స్వయంభుకి పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ఒకవేళ ఫిబ్రవరి అయ్యుంటే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా, మంచి రిలీజ్ దక్కించుకుని భారీ థియేటర్ రన్ దక్కేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత సానుకూలంగా ఉండబోవడం లేదు.

ఎందుకంటే మార్చి 19 దురంధర్ ది రివెంజ్, టాక్సిక్ వచ్చాక కేవలం వారం గ్యాప్ లో ఉస్తాద్ భగత్ సింగ్ దిగుతాడు. వీటికి ఎంత లేదన్నా రెండు వారాల థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతాయి. ముఖ్యంగా యష్, రణ్వీర్ సింగ్ సినిమాలకు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున స్క్రీన్లు లాకవుతాయి. వీటికి పాజిటివ్ టాక్ వస్తే కనీసం నెల రోజుల రన్ ఖాయం.

ఏప్రిల్ 3 శర్వానంద్ బైకర్ ఉంటుంది. ఇంకోవైపు మార్చి 19 నుంచి తప్పుకున్న అడివి శేష్ డెకాయిట్ ఏప్రిల్ వైపే చూస్తోంది. పదో తేదీ గురించి ఆలోచిస్తున్నారు కానీ స్వయంభుతో నేరుగా తలపడాలా వద్దానే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఎందుకంటే ఏప్రిల్ 30 పెద్ది వస్తున్న నేపథ్యంలో దానికన్నా రెండు వారాల ముందు ఇతర రిలీజులు వస్తే రెవిన్యూ పరంగా అందరికీ ప్లస్ అవుతుంది. అలా కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో గుడ్డిగా బరిలో దిగితే లేనిపోని సమస్యలు రావొచ్చు. ఇలాంటి సెన్సిటివ్ వాతావరణంలో స్వయంభు మీద అటెన్షన్ రావాలంటే ఓ రేంజ్ లో సౌండ్ చేయాల్సిందే. నిఖిల్ అదే ప్లానింగ్ లో ఉన్నాడు.

Related Post

Big Update: Ram Charan’s “Peddi” Set to Drop a Lovely Musical BlastBig Update: Ram Charan’s “Peddi” Set to Drop a Lovely Musical Blast

Director Buchi Babu Sana has shared a big festive update about Ram Charan’s upcoming film “Peddi.” Speaking at a recent press meet, he revealed that A.R. Rahman has composed a