hyderabadupdates.com movies తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ నివేదిక‌లో ప‌లు విష‌యాల‌ను విస్మ‌రించార‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అస‌లు దోషుల‌ను విస్మ‌రించార‌ని.. కేవ‌లం అధికారుల‌పైనే నివేదిక ఆరోప‌ణ‌లు చేసింద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు దోషుల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చి తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సి ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఏక స‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. తాజాగా జ‌రిగిన కూటమి నేత‌ల కీల‌క స‌మావేశంలో దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం.. ఈ వ్య‌వ‌హారంపై ప‌లు విషయాల‌ను సీఎం చంద్ర‌బాబుతో పంచుకున్నారు. దీనిలో ప్ర‌ధానంగా ఏక‌స‌భ్య క‌మిష‌న్ వైపు ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంది. ఇక‌, ఈ క‌మిష‌న్ ద్వారా వాస్త‌వాల‌ను మ‌రింత లోతుగా విచారించ‌నున్నారు. త‌ద్వారా దోషుల‌ను తేల్చ‌నున్నారు. ఎంత‌టివారినైనా చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌నున్నారు.

ఇవీ తేలే విష‌యాలు..

+ 2022లోనే క‌ల్తీ నెయ్యిపై సీఎఫ్టీఆర్ఐ  నివేదిక వ‌చ్చినా.. ఎందుకు తొక్కి పెట్టారు?+ ఎవరి ఆదేశాల‌తో ఆనాడు నివేదిక‌ను విస్మ‌రించారు.+ నెయ్యి ద్వారా చేతులు మారిన సొమ్ము ఎంత‌?+ నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింది ఎంత‌?  ఏమేర‌కు క‌ల్తీ చేశారు?+ వైసీపీ హ‌యాంలో ఎన్నాళ్లు ఇలా జ‌రిగింది?  దీని వెనుక ఎవ‌రి పాత్ర ఏంటి?+ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను మ‌రింత కూలంక‌షంగా విచార‌ణ చేయ‌నున్నారు.+ ఎన్‌డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంటు బోర్డు) నివేదికలో వెల్ల‌డించిన వాస్త‌వాల‌పై మ‌రింత అధ్య‌య‌నం.+  దోషులు ఎంత‌టి వారైనా వారిని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌డం.

Related Post

Why Anil Ravipudi is a step ahead with Mana Shankara Vara Prasad Garu?Why Anil Ravipudi is a step ahead with Mana Shankara Vara Prasad Garu?

Mana Shankara Vara Prasad Garu, slated for release on January 12, is directed by Anil Ravipudi and stars megastar Chiranjeevi in the lead. Known for his sensible planning, Ravipudi reportedly

Laalo Krishna Sada Sahaayate Box Office: On Course To Historic 100 Crore in IndiaLaalo Krishna Sada Sahaayate Box Office: On Course To Historic 100 Crore in India

Laalo: Krishna Sada Sahaayate collected Rs. 2.75 crore approx on its sixth Wednesday, with business once again growing from Monday. Typically, Wednesday drops 20–25 per cent from Monday, but Laalo