hyderabadupdates.com Gallery సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ post thumbnail image

హైద‌రాబాద్ : మిర్యాల‌గూడ వేదిక‌గా జ‌ర‌గిన బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గ‌రువారం కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌మాజం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష‌ను చూసి సిగ్గు ప‌డుతోంద‌న్నారు. అయినా సోయి లేకుండా ఇష్టానుసారంగా ఎలా ప‌డితే అలా మాట్లాడ‌టం దారుణ‌మన్నారు. త‌ను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. మెద‌డులో చిప్ దొబ్బిన‌ట్టు ఉందంటూ అనుమానం వ్య‌క్తం చేశారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవని కేవ‌లం వ‌చ్చేది మాత్రం మురికి భాష త‌ప్ప మ‌రోటి రాద‌న్నారు.
హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఐదు రోఉలు కాదు 500 రోజుల పాటు కోర్సులు చేసినా రేవంత్ రెడ్డి వ్య‌క్తిత్వం మార‌ద‌న్నారు. బూతు భాష త‌ప్పా త‌న‌కు ఏదీ రాద‌న్నారు. ఎన్ని కోర్సులు చ‌దివితే ఏం లాభం. సంస్కారం అనేది లేక పోతే అని మండిప‌డ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి, ఉద్యమాల్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ ను ఉద్దేశించి వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు కేటీఆర్. ప్ర‌జ‌లు నిన్ను క్ష‌మించ‌ర‌ని, రాబోయే రోజుల్లో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగితే రేపొద్దున ప‌వ‌ర్ పోయే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.
The post సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Priyank Kharge: ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గేPriyank Kharge: ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే

Priyank Kharge : బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్

ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ ప్రీణత్ రావు సీఐగా డిమోట్ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ ప్రీణత్ రావు సీఐగా డిమోట్

హైద‌రాబాద్ : అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ అధికారి దుగ్యాల ప్ర‌ణీత్ రావును డీమోట్ చేస్తూ మంగ‌ళ‌వారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అతనికి ఇచ్చిన వేగవంతమైన పదోన్నతిని రద్దు