hyderabadupdates.com Gallery చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌ post thumbnail image

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బూతులు. అస‌లు ఇది కోరి తెచ్చుకున్న తెలంగాణానా లేక ఆంధ్రానా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా చంద్ర‌హాస్ పాట పాడుతున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తితో పాటు చంద్ర‌హాస్ తండ్రి ప్ర‌భాక‌ర్ కూడా ఉన్నాడు. వారితో పాటు సినీ రంగానికి చెందిన వారితో పాటు మ‌హిళ‌లు కూడా ఉండ‌డం విశేషం.
సోష‌ల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో తీవ్ర ఆగ్ర‌హం, వ్య‌తిరేకత వ్య‌క్తం కావ‌డంతో బ‌రా బ‌ర్ ప్రేమిస్తా నిర్మాత‌లు సైతం తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇంకా విడుద‌ల కాకుండానే ఇలాంటి ట్రోల్స్ కు గురి కావ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా చంద్ర‌హాస్ అశ్లీల పాట‌పై తీవ్రంగా స్పందించాడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి. గురువారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. ఇలాంటి పాట‌లు స‌భ్య స‌మాజాన్ని ప్ర‌భావితం చూపిస్తాయ‌ని, ఇది విలువ‌లకు మంగ‌ళం పాడేలా ఉంద‌ని ఫైర్ అయ్యాడు. టెలివిజన్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక అశ్లీల పాటను రాసి బహిరంగంగా పాడాడు. ఆ త‌ర్వాత వివాదంలోకి దిగాడు. సత్య, శివ, వాస్తు శాస్త్రం వంటి హిందీ చిత్రాలలో కీ రోల్స్ పోషించిన జేడీ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఇటువంటి ప్రవర్తన గుర్తింపు కోసం కష్టపడి పనిచేసే నిజమైన కళాకారుల గౌరవాన్ని దెబ్బ తీస్తుంద‌న్నారు.
The post చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

హైద‌రాబాద్ : ప్రిన్స్ మ‌హేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రా కీ రోల్స్ పోషించిన చిత్రం వార‌ణాసి. దీనికి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో దీనిని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే వార‌ణాసి

బాలీవుడ్ పై ఏఆర్ రెహ‌మాన్ షాకింగ్ కామెంట్స్బాలీవుడ్ పై ఏఆర్ రెహ‌మాన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : ఆస్కార్ అవార్డు విన్న‌ర్ , మ్యూజిక్ లెజండ్ అల్లా ర‌ఖా రెహమాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళం, హిందీ , తెలుగు భాష‌ల‌లో ప‌లు సినిమాల‌కు మ్యూజిక్ అందించాడు. ఈ సంద‌ర్భంగా త‌ను సంగీతం అందించిన తొలి

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలుశ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలు

హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా