hyderabadupdates.com Gallery శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని చెప్పారు . గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని అన్నారు సీఎం. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం అన్నారు. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ అది అని పేర్కొన్నారు. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించు కోకుండా యదేఛ్చగా కొనసాగించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపామ‌ని తెలిపారు. సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందన్నారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని పేర్కొన్నారు సీఎం. హైందవం పట్ల ఆయనకు విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా అని ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి.
The post శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు

ఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలుఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలు

అమ‌రావ‌తి : ఏఐ టెక్నాల‌జీ వినియోగించ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఏఐ టెక్నాలజీ వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

CM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two yearsCM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two years

Chief Minister Revanth Reddy has instructed the officials to complete the construction of the new buildings of Osmania Hospital within two years. He held a review meeting at his residence on the progress of the construction work