hyderabadupdates.com Gallery ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ

ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ

ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ post thumbnail image

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జ‌న సురాజ్ పార్టీ చీఫ్‌, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిష‌ర్ కు. శుక్ర‌వారం ఆయ‌న గ‌త ఏడాది బీహార్ లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ఓట్లు పోల్ కాలేద‌ని పేర్కొన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర చోటు చేసుకుంద‌ని, దీనిపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని, పునః ప‌రిశీలించాల‌ని పీకే డిమాండ్ చేశారు. ఆయ‌న‌తో పాటు ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు కూడా చేశారు మ‌రో అగ్ర నాయ‌కుడు, లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత , ఎంపీ రాహుల్ గాంధీ. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం ప్ర‌శాంత్ కిషోర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను స్వీక‌రించ బోమంటూ స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రుణ భారంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింద‌ని ఆరోపించారు పీకే. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద రూ. 15,600 కోట్లు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఇది ఇతర రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలను నిరాకరించిందని ఆరోపించారు ప్ర‌శాంత్ కిషోర్. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల కారణంగా ఇప్ప‌టికే నిర్వ‌హించిన ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన దావాను స్వీక‌రించేందుకు నిరాక‌రించింది సుప్రీంకోర్టు.
కాగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజాదరణ పొందడానికి చేస్తున్న ప్ర‌య‌త్నంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పీకేపై ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, ఈ సమస్య కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి పాట్నా హైకోర్టును ఆశ్రయించమని కోరింది.
The post ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలుశ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు

హైద‌రాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు

Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

  దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని

Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌

  బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ‘ఒక్క ఛాన్స్‌ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల… రాష్ట్రంలో శాంతిభద్రతలు