hyderabadupdates.com movies ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఘ‌ట్టం ప్రారంభం అయింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి ల‌భించింది. దీంతో ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు సిద్ధ‌మ‌య్యారు. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాల‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని గ్రామ పంచాయ‌తీల‌లో ఓట‌ర్ల‌ జాబితాలు తయారు చేయాల‌ని దిశానిర్దేశం చేసింది. సిద్ధమైన ఓటరు జాబితాలను మార్చి 9న(అంటే నెల రోజుల్లో ) అన్ని వార్డు, గ్రామ స‌చివాల‌యాల్లో ప్రచురించనున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితాల‌పై వ‌చ్చే అభ్యంత‌రాల‌ను 15 రోజుల వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. వాటికి ప‌రిష్కారం చూపిస్తారు. కొత్త‌గా ఓట‌రుగా న‌మోద‌య్యేందుకు గ్రామ పంచాయ‌తీ స్థాయిలో ఇప్పుడు అవ‌కాశం లేద‌ని.. జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ఎంత మంది ఉంటే అంత‌మందికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని పేర్కొంది.

ఎప్పుడు జ‌ర‌గొచ్చు..

ప్ర‌స్తుతం ఈ నెల చివ‌రిలో దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న ప్రారంభం కానుంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ఈ నెల 20వ తేదీలోగా నిర్వ‌హించాల‌ని గ‌తంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్రాల‌కు సూచించింది. అయితే.. ఏపీలో మాత్రం మార్చి 31 వ తేదీ వ‌ర‌కు పంచాయ‌తీల‌కు గ‌డువు ఉంది.

దీంతో మార్చి 31 త‌ర్వాతే..కొత్తగా పంచాయ‌తీల్లో పాల‌న ప్రారంభం అవుతుంది. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ప్ర‌త్యేక ప్ర‌తిపాద‌న తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల నుంచి స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. ఈ అనుమ‌తి ఎప్పుడు వ‌స్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. అప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లోనే( విలేజ్ సెక్ర‌ట‌రీ) పంచాయ‌తీలు న‌డ‌వ‌నున్నాయి.

Related Post

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లుభారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తి అయ్యే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. గ‌త ప‌దేళ్ల‌లో ఆయా దేశాలు.. 90

బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్

ఏపీ కేడ‌ర్‌కు చెందిన వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకున్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో  ఓ పోస్టు చేశారు. దీనికి ఆయ‌న పెట్టిన టైటిల్ `ప‌బ్లిక్ అపాల‌జీ`(బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌). ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీఐఏఎస్

ట్రోలింగ్ నేర్పిస్తున్న కొత్త పాఠంట్రోలింగ్ నేర్పిస్తున్న కొత్త పాఠం

అనుకున్నట్టే రాజా సాబ్ ఓటిటిలో వచ్చాక ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యింది. మాములుగా హాట్ స్టార్ లాంటి హై స్టాండర్డ్ ఓటిటిలో స్క్రీన్ షాట్లు, వీడియో క్లిప్స్ కట్ చేయడం అసాధ్యం. కానీ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి పైరసీ సైట్ల నుంచి