hyderabadupdates.com movies గౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెను

గౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెను

గత 25 ఏళ్లలో దక్షిణాదిన వచ్చిన ఉత్తమ ప్రేమకథల జాబితా తీస్తే.. అందులో ముందు వరుసలో గౌతమ్ మేనన్ సినిమాలే ఉంటాయి. ఆయన తొలి చిత్రం ‘చెలి’నే ఓ అందమైన ప్రేమకథ. ఆ తర్వాత ఓ వైపు ‘కాక్క కాక్క’, ‘వేట్టయాడు విలయాడు’ ‘రాఘవన్), ‘ఎన్నై అరిందాల్’ (ఎంతవాడుగానీ) లాంటి యాక్షన్ సినిమాలు తీస్తూనే.. ఇంకోవైపు విన్నైతాండి వరువాయ (ఏమాయ చేసావే), నీదానే యన్ పొన్ వసంతం (ఎటో వెళ్లిపోయింది మనసు), అచ్చం ఎన్బదు మదమైయిదా (సాహసం శ్వాసగా సాగిపో) లాంటి ప్రేమకథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.

గౌతమ్ లవ్ స్టోరీలు కొన్ని సరిగా ఆడకపోయి ఉండొచ్చు.. కానీ వాటిలో ఆయన క్లాస్ మాత్రం కనిపిస్తుంది. ఐతే ఈ విలక్షణ దర్శకుడు నిఖార్సయిన ప్రేమకథ తీసి చాలా రోజులైపోయింది. అసలాయన సినిమాలు తీయడమే తగ్గించేశారు. ఐతే ఇప్పుడు మళ్లీ తన మార్కు లవ్ స్టోరీ తీయాలని అనుకుంటున్నాడట గౌతమ్. దీనికి సరైన ఆర్టిస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు గౌతమ్.

మళ్లీ మనసు పెట్టి ఒక ప్రేమకథను రాసినట్లు గౌతమ్ వెల్లడించాడు. ఐతే ఒకప్పట్లా స్టార్ హీరోలు ఇప్పుడు ప్రేమకథలు చేయట్లేదని.. కాబట్టి తన ప్రేమకథకు ఆర్టిస్టులను ఎంచుకోవడం కష్టంగా ఉందని గౌతమ్ అన్నాడు. ఈ కథ ఎవరిని ఎంచుకుంటుందో చూడాలని చెప్పాడు.

తన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావడం గురించి గౌతమ్ మాట్లాడుతూ.. తాను వేరే నిర్మాతలకు చేసిన సినిమాల్లో ఏదీ దాదాపుగా నష్టాలు తెచ్చిపెట్టలేదని గౌతమ్ స్పష్టం చేశాడు. తాను సొంతంగా ప్రొడ్యూస్ చేసిన సినిమాలే సరిగా ఆడలేదన్నాడు. ధనుష్‌తో తీసిన ‘ఎన్నై నోకి పాయుం తోటా’ ఎక్కువ నష్టం మిగిల్చిందన్నాడు గౌతమ్.

సరదా కోసమే నటుడిగా సినిమాలు చేస్తూ వచ్చానని.. ఇప్పుడు బ్రేక్ తీసుకుని వరుసగా సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు గౌతమ్. సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని.. తన పాటల్లో సగానికి పైగా అతనే కంపోజ్ చేశాడని చెప్పిన గౌతమ్.. ఒక్క ‘నడునిసి నాయిగల్’ (ఎర్ర గులాబీలు) చిత్రంలో మాత్రమే పాటలు లేకుండా ప్రయోగం చేశానని.. అది ఫలితాన్నివ్వలేదని అన్నాడు.

గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ‘ధ్రువనక్షత్రం’ చాలా ఏళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఈ చిత్రాన్ని బయటికి తీసుకురావడానికి మరోసారి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్.

Related Post

A surreal feeling-Anaswara Rajan on audience response to ChampionA surreal feeling-Anaswara Rajan on audience response to Champion

Malayali actress Anaswara Rajan has made a promising Telugu debut with Champion, and the young performer is already earning appreciation from audiences. Her performance in the film has been receiving

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం