hyderabadupdates.com movies ఈసారి ‘సింగిల్’ సింహంగా బాలయ్యా?

ఈసారి ‘సింగిల్’ సింహంగా బాలయ్యా?

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒక ఫార్మాట్లో సాగిపోతుంటాయి. చాలా ఏళ్ల నుంచి బాలయ్య సినిమాలను గమనిస్తే.. ఎక్కువగా డ్యూయల్ రోల్స్‌లో కనిపిస్తారు. లేదా ఒక పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. డ్యూయల్ రోల్ చేసినా, షేడ్స్ చూపించినా.. బాలయ్య అవతారం మారిపోతుంటుంది. రెండు పాత్రలకూ ఇద్దరు హీరోయిన్లను పెడతారు. ఇక ఆయన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నది చాలా కామన్.

బాలయ్య చివరి సినిమా ‘అఖండ-2’.. అంతకుముందు వచ్చిన డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అఖండ, రూలర్.. ఇలా ప్రతి సినిమా దాదాపుగా ఈ కోవలోనే ఉంటాయి. బాలయ్య అనగానే ఈ ఫార్మాట్లోనే కథలు రాసుకుంటూ ఉంటారు రచయితలు, దర్శకులు. బాలయ్యను అలా ఎన్నిసార్లు చూపించినా సరే.. ఆయన అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చుతారు.

ఐతే బాలయ్యతో కొత్త సినిమా చేయబోతున్న గోపీచంద్ మలినేని మాత్రం కొంచెం రూటు మారుస్తున్నాడట. ముందు బాలయ్య కోసం చేసిన చారిత్రక నేపథ్యం కథలో హీరోది డ్యూయల్ రోలే. కానీ దాన్ని పక్కన పెట్టి చేసుకున్న మాస్ కథలో మాత్రం బాలయ్యది ఒకే పాత్ర అట. దీనిపై అధికారిక ముద్ర పడలేదు కానీ విశ్వసనీయ సమాచారం బలంగా ఉంది.

ఇదొక గ్యాంగ్‌స్టర్ రోల్ అని.. కథ పూర్తిగా ముంబయి నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. మాస్ సినిమానే అయినా.. బాలయ్య చిత్రాల్లో స్టీరియో టైప్ బ్రేక్ చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.

ఈ సినిమా కోసం బాలయ్య లుక్ మార్చబోతున్నాడు. స్క్రిప్టుకు ఇటీవలే బాలయ్య ఆమోద ముద్ర వేయగా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కొన్ని వారాల్లోనే షూటింగ్ మొదలుపెడతారు. షూటింగ్ కూడా ముంబయిలోనే ఎక్కువగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే లక్ష్యంతో ఉంది ఈ చిత్ర బృందం.

‘పెద్ది’ సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారుతో కలిసి బాలయ్య తనయురాలు తేజస్వి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. బాలయ్యకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన తమనే దీనికీ మ్యూజిక్ చేయబోతున్నాడు.

Related Post

8 South Movies to Watch on OTT This Week: Vijay Sethupathi’s Gandhi Talks, With Love to Indrajith Sukumaran’s Dheeram8 South Movies to Watch on OTT This Week: Vijay Sethupathi’s Gandhi Talks, With Love to Indrajith Sukumaran’s Dheeram

Cast: Indrajith Sukumaran, Renji Paniker, Aju Varghese, Nishanth Sagar, Divya Pillai, Reba Monica John Director: Jithin Suresh T. Genre: Mystery Psychological Thriller Runtime: 2 hours and 31 minutes Language: Malayalam Streaming