hyderabadupdates.com Gallery యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రం

యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రం

యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రం post thumbnail image

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్ర‌స్తావించారు. ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయంతో యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విభ‌జ‌న‌లు సృష్టించ కూడ‌ద‌న్నారు. హిందూత్వ సిద్ధాంతకర్త వి డి సావర్కర్‌కు భారతరత్న అవార్డును ప్రదానం చేయాల‌ని కేంద్ర‌స స‌ర్కార్ ను డిమాండ్ చేశారు. దీని వ‌ల్ల ఆ అవార్డుకు మ‌రింత ప్ర‌తిష్ట పెరుగుతుంద‌ని చెప్పారు. ఆదివారం ఆర్ఎస్ఎస్ అధినేత మీడియాతో మాట్లాడారు. యూసీసీకి సంబంధించి అంద‌రినీ విశ్వాసంలోకి తీసుకుని రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు.
అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఆర్ఎస్ఎస్ కు మంచి రోజులు వ‌చ్చాయా అన్న ప్ర‌శ్న‌కు ఇందుకు స‌మాధానం ఇస్తూ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంఘ్ కట్టుబడి ఉందన్నారు. దానికి మద్దతు ఇచ్చిన వారు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నటులు రవీనా టాండన్, విక్కీ కౌశల్, అనన్య పాండే, చిత్రనిర్మాతలు కరణ్ జోహార్, మధుర్ భండార్కర్, రమేష్ తౌరానీ, సంగీతకారుడు పండిట్ హృదయనాథ్ మంగేష్కర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లో మూడు లక్షల సూచనలు వ‌చ్చాయ‌ని తెలిపారు. మ‌నంద‌రం ఒకే స‌మాజానికి చెందిన వార‌మ‌న్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్.
The post యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీ ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. 2.50 కోట్లు విరాళంటీటీడీ ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. 2.50 కోట్లు విరాళం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)కు భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. 2.50 కోట్లు విరాళం అందింది. హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ విరాళాన్ని

బాబూ ఇంకెంత మందిని బ‌లి తీసుకుంటావుబాబూ ఇంకెంత మందిని బ‌లి తీసుకుంటావు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ హ‌యాంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని, సామాన్యుల‌కు, ప్ర‌ధానంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. బాబూ ఇంకెంత మందిని

పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల‌కు భ‌రోసా ఇచ్చారు. పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్ర‌క‌టించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్