hyderabadupdates.com Gallery సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్

సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్

సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్ post thumbnail image

వికారాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత చెత్త ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క‌డు సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా రోడ్ కార్న‌ర్ మీటింగ్ లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి రోజు రోజుకు అదుపు త‌ప్పి మాట్లాడుతున్నాడ‌ని, సోయి లేకుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌ను సీఎంగా ఎవ‌రూ అంగీక‌రించ‌డం లేద‌న్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.
ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతారని, ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబుతారని కానీ సీఎం అలా కాద‌న్నారు. త‌ను కేవ‌లం బూతుల ముఖ్య‌మంత్రిగా మారి పోయాడ‌ని అన్నారు. పాల‌న చేత‌కాక విప‌క్షాల మీద నోరు పారేసు కోవ‌డం త‌ప్పితే ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలుగా కేసీఆర్ ను తిట్టడం తప్పించి చేసింది ఏమీ లేదంటూ మండిప‌డ్డారు కేటీఆర్. ప్రతిరోజూ వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించడమే రేవంత్ రెడ్డి పని అని అన్నారు. ఈ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడు సంవత్సరాల దాకా దొరకరని హెచ్చ‌రించారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి అని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్.
The post సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాంతెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాము ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు .

Kinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసుKinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసు

Kinjarapu Rammohan Naidu : విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు (Kinjarapu Rammohan Naidu) తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని

బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా భార‌త దేశం : అశ్విని వైష్ణ‌వ్బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా భార‌త దేశం : అశ్విని వైష్ణ‌వ్

దావోస్ : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ బిజీగా ఉన్నారు. ఆయ‌న స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రుగుతున్న ప్రపంచ ఆర్థిక స‌ద‌స్సు -2026లో పాల్గొన్నారు. భార‌త దేశం త‌రపున ఆయ‌న ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో, సీఈవోలు, చైర్మ‌న్ లు,