hyderabadupdates.com movies దృశ్యం-3 క్లైమాక్స్… వేరే లెవెలట

దృశ్యం-3 క్లైమాక్స్… వేరే లెవెలట

భారతీయ సినిమా చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. ఈ మలయాళ చిత్రాన్ని ఇండియాలోని పలు భాషల్లోనే కాక విదేశీ భాషల్లో సైతం రీమేక్ చేశారంటే.. అదెంత పవర్ ఫుల్ మూవీనో అర్థం చేసుకోవచ్చు. ఏ భాషలో రీమేక్ చేసినా మంచి ఫలితాన్నే అందుకుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ నేరుగా ఓటీటీలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది.

మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ ఆల్రెడీ ‘దృశ్యం-3’ షూట్ పూర్తి చేశాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఐతే ఈ సినిమా మొదలైనపుడు.. ఇందులో ట్విస్టుల కంటే డ్రామా ఎక్కువ ఉంటుందని.. ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాల స్థాయిలో థ్రిల్స్‌ను ఊహించుకోవద్దని అన్నాడు జీతు జోసెఫ్. ఏదైనా సీక్వెల్ వస్తోందంటే.. ఇంకా హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ జీతు మాత్రం పనిగట్టుకుని అంచనాలను తగ్గిస్తున్నట్లు అనిపించింది.

ఐతే ఇప్పుడు జీతు వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడుతోంది ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఆశా శరత్. హీరో చేతిలో హత్యకు గురైన కుర్రాడి తల్లిగా, పోలీసాఫీసర్‌గా ‘దృశ్యం’ తొలి రెండు భాగాల్లో కీలక పాత్ర పోషించింది ఆశా. ఆమె ‘దృశ్యం-3’ క్లైమాక్స్ గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చింది.

‘‘దృశ్యం-3 క్లైమాక్స్ చూసి స్టన్ అయిపోతారు. ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు. ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే సినిమా ఇది’’ అంటూ కొనియాడారు ఆశా శరత్.సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నటి ఇలా చెబుతోందంటే ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ లాగే ‘దృశ్యం-3’ కూడా వేరే లెవెల్లోనే ఉంటుందని ఆశించవచ్చు.

ముందే అంచనాలు పెంచుకోవద్దనే జీతు జోసెఫ్ సినిమా మొదలవుతున్నపుడు అలా చెప్పి ఉండొచ్చు. ముందుగా మలయాళంలో రిలీజయ్యాక ‘దృశ్యం-3’ని హిందీ, తెలుగు భాషల్లోనూ రీమేక్ చేయనున్నారు. ఇంతకుముందులాగే హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తారు.

Related Post

రీమేక్ కాదని ఎన్నిసార్లు చెప్పాలి?రీమేక్ కాదని ఎన్నిసార్లు చెప్పాలి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని ఎఫ్పట్నుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్