hyderabadupdates.com Gallery చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?

చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?

చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..? post thumbnail image

తూర్పు గోదావ‌రి జిల్లా : మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. తాను రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అన్న విష‌యం మ‌రిచి పోయి మాట్లాడుతుండ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న , కొన‌సాగుతున్న రూల్స్ మారి పోతున్నాయ‌ని పేర్కొన్నారు. అదే ప‌నిగా క‌క్ష సాధింపు రాజ‌కీయాలు మ‌రింత పెరిగి పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధ్వంసం, దాడులు, పెట్రోలు బాంబులు ,కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ ,తిట్టిన వారికి సెంట్రల్ జైల్ ను కేరాఫ్ గా మార్చేశారంటూ మండిప‌డ్డారు.
ఇదేనా మీరు చెప్పిన ప్ర‌జా పాల‌న అని ప్ర‌శ్నించారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. కావాల‌ని కక్షతోనే అంబటి రాంబాబును జైలుకు పంపించార‌ని ఆరోపించారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ కొవ్వు వాడ‌లేద‌ని స్ప‌ష్టం చేసింద‌న్నారు. అయినా చంద్ర‌బాబు నాయుడు అదే ప‌నిగా శ్రీ‌వారి పేరుతో రాజ‌కీయం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దైవం పేరుతో పాలిటిక్స్ చేస్తే చివ‌ర‌కు త‌న‌కు ఫ్యూచ‌ర్ లేకుండా పోతుంద‌న్నారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. రాజ‌మండ్రి జైలులో ఉన్న‌మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుతో ములాఖ‌త్ అయ్యారు. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని మండిప‌డ్డారు. కక్ష సాధింపు అనేది క్లియర్‌ గా తెలిసి పోయింద‌న్నారు. విచిత్రం ఏమిటంటే అంబ‌టి రాంబాబుపై కేవ‌లం 2 రోజుల్లో 36కి పైగా కేసులు ఎలా న‌మోదు చేశారంటూ ప్ర‌శ్నించారు.
The post చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Manchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణుManchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు

    విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి

CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతిCP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతి

    సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నవంబర్‌ 22 విశిష్టత గురించి

Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

    భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ట్రైలర్‌ మాత్రమేనన్న ఆయన… పాక్‌ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్‌ క్షిపణి పరిధిలో ఉందని… స్పష్టం