hyderabadupdates.com Gallery సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న

సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న

సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న post thumbnail image

గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో వార్డెన్లు త‌మ ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. కొంద‌రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల కోసం మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. కిచెన్లలలో రూ. 20 కోట్ల తో వంట సామాగ్రిని సమకూర్చిన‌ట్లు తెలిపారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లలో భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్య విలువ తెలిసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో వసతి గృహాల్లోనూ సూపర్ ఫైవ్ రైస్ ను అందిస్తున్నామన్నారు ఎస్. స‌విత‌. వసతి గృహాల్లో పరిశుభ్రత కోసం 1300 మంది శానిటేషన్ వర్కర్లను, విద్యార్థులకు అనుగుణంగా కామటి, కుక్ లను నియమించుకునేందుకు 142 అదనపు పోస్టుల‌ను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారులకు వాహనాల అలెవెన్సులు అందిస్తున్నామన్నారు.
మహాత్మ జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలలకు రూ. 500 కోట్ల తో 10 నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా వార్డెన్లు విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్లో లెర్నింగ్ విద్యార్థులకు మరింత శిక్షణ అందించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించి తక్షణమే చర్యలు తీసుకునేలా సూచనలు అందిస్తున్నారని అన్నారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా పర్యవేక్షించాలని, డైట్ ఖచ్చితంగా అమలు చేయాలని, సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు. విద్యార్థులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎఫ్ ఆర్ ఎస్ లో హాజరు కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని, పిల్లలకు పెట్టే మెనూలో కక్కుక్తి పడితే సహించేదిలేదని హెచ్చరించారు. విద్యార్థుల భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పునాదివేసేలా తీర్చిదిద్దేందుకు సంక్షేమ అధికారులు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వసతి గృహాల్లో మెను అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా బిసి సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్చార్జి వార్డెన్లు ఉన్న వసతి గృహాల నిర్వహణను ఎబీసీడబ్ల్యుసీ లు పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసేలా.నాణ్యమైన విద్య బోధన, వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా వార్డెన్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు..
బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియల్ కార్యదర్శి సత్యన్నారాయణ రాజు మాట్లాడుతూ పబ్లిక్ పెర్సెప్షన్ వసతి గృహాల మరింతగా మెరుగు పర్చుకోవాలని సూచించారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన అంశాలను వెంటనే సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పదవ తరగతిలో స్లో లెర్నింగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా సంక్షేమ అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ స‌మావేశంలో ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీ లత, జాయింట్ డైరెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రాజు, గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ అధికారి మయూరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్ పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
The post సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న గురించి లేని పోని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బెంగ‌ళూరులో

బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీబంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ

దుబాయ్ : భ‌ద్ర‌తా కార‌ణాల పేరుతో వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేర‌కు త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ మైదానాలు

Droupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతిDroupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్‌ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె… దాదాపు