hyderabadupdates.com Gallery బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్

బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్

బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్ post thumbnail image

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్ప‌టికే త‌న అటిట్యూడ్ కార‌ణంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఇదే క్ర‌మంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత పుష్ప మూవీలో త‌గ్గేదే లే అంటూ కొన‌సాగుతున్నాడు. తాజాగా త‌న‌పై బాలీవుడ్ కు చెందిన కావేరీ బారువా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఇండియాలో ప్ర‌ముఖ బ్రాండ్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌ని చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా త‌ను ఈ మ‌ధ్య‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అల్లు అర్జున్ గురించి. త‌న‌కు ఇగో ఎక్కువ అన్న‌ట్టు అర్థం వ‌చ్చేలా మాట్లాడారు. అల్లు అర్జున్ తో షూట్ అంటే 42 రూల్స్ పాటించాల్సిందేనని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
అల్లు అర్జున్ తో యాడ్ షూట్ సమయంలో తనకు విచిత్ర అనుభవం ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి. దీనిపై తీవ్రంగా స్పందించాడు న‌టుడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ను క‌లిసేందుకు ముందు మేనేజ‌ర్ త‌న‌కు 42 రూల్స్ చెప్పారంటూ కావేరీ బారువా బాంబు పేల్చింది. అయితే దీనిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు అల్లు అర్జున్. ఆమె చేసిన కామెంట్స్ వ‌ల్ల త‌న‌కు డ్యామేజ్ జ‌రిగింద‌ని వాపోయాడు. ఆపై కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు బ‌న్నీ. దీనిపై ఇంకా స్పందించ లేదు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన కావేరీ బారువా.
The post బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబ‌రం అరెస్ట్ కాక త‌ప్ప‌దా. ఆ దిశ‌గా ఈడీ రంగంలోకి దిగింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్‌లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం

విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడువిశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు

అమరావతి : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్ర‌శంలు కురిపించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను