hyderabadupdates.com movies ఉదయ్ కిరణ్ కోసం మేనకోడలు.. మేనల్లుడు..

ఉదయ్ కిరణ్ కోసం మేనకోడలు.. మేనల్లుడు..

టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ పేరు వినగానే ఒకప్పటి మనసుకు హత్తుకునే ప్రేమకథలే గుర్తొస్తాయి. ఇక దాదాపు 25 ఏళ్ల క్రితం ‘మనసంతా నువ్వే’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే క్లాసిక్ లవ్ స్టోరీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మళ్ళీ వస్తోంది. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా ప్రమోషన్స్ కోసం స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.

ఇటీవల ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేయగా, ఇప్పుడు ఆయన మేనకోడలు మహతి కూడా ముందుకొచ్చారు. 25 ఏళ్ల తర్వాత మా మామ సినిమా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడటం చాలా గర్వంగా ఉందని ఆమె ఒక వీడియో బైట్ ఇచ్చారు. చిన్నప్పుడు ఉదయ్ కిరణ్ సినిమాలను థియేటర్లో చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.

వరుసగా హీరో మేనల్లుడు, మేనకోడలు ఇద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటుండటంతో ఉదయ్ కిరణ్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఉదయ్ కిరణ్ సినీ ప్రయాణం అర్థాంతరంగా ముగిసినా, ఆయన సినిమాలను గుండెల్లో పెట్టుకున్న వారు ఇప్పటికీ కోట్లలో ఉన్నారు. వారి కోరిక మేరకే మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ తో ఈ ఈవెంట్ కి ఇప్పుడు మరింత బజ్ వచ్చింది.

ఫిబ్రవరి 14న థియేటర్లలో ‘మనసంతా నువ్వే’ పాటలు మళ్ళీ మార్మోగబోతున్నాయి. ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్, ఎం.ఎస్. రాజు మేకింగ్ ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తాయి. ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అవుతున్నా, వాలెంటైన్స్ డే కావడంతో యూత్ ఈ సినిమాకు ఎంత వరకు కనెక్ట్ అవుతారో చూడాలి.

ఇక ఉదయ్ కిరణ్ సినిమాల్లో ఉండే ఆ అమాయకత్వం, సున్నితమైన కథలు ఇప్పటికీ మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మనసంతా నువ్వే రీ రిలీజ్ రోజున థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడతాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఏ స్థాయిలో సక్సెస్ చేస్తారో చూడాలి.

Related Post

స్వయంభు ఇంకా ఎంత లేటవుతుందిస్వయంభు ఇంకా ఎంత లేటవుతుంది

యూత్ హీరో నిఖిల్ ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశాడు. తన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకుంది కానీ నెలలు దాటి సంవత్సరం అయిపోతున్నా ఇప్పటిదాకా విడుదల తేదీ ప్రకటించలేదు. మొన్నెప్పుడో అనౌన్స్ మెంట్ ఇస్తామనే రేంజ్

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం హిందీలో మాత్ర‌మే రిలీజైంది. వ‌ర‌ల్డ్ వైడ్ ఏకంగా రూ.1400 కోట్ల మేర క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇండియా వ‌ర‌కే వ‌సూళ్లు రూ.900

Srinidhi Shetty – In Telusu Kada, we’ve explored a unique pointSrinidhi Shetty – In Telusu Kada, we’ve explored a unique point

Celebrity stylist Neerraja Kona is making her directorial debut with the romantic drama Telusu Kada, which features Siddhu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty in the lead roles. The promotional