hyderabadupdates.com movies బూత్ లో జగ్గారెడ్డి బూతులు

బూత్ లో జగ్గారెడ్డి బూతులు

కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వచ్చి తన తరఫున ప్రచారం చేసినా తనను ఓడించారని, సంగారెడ్డి నుంచి భవిష్యత్తులో పోటీ చేసే ప్రసక్తే లేదని ప్రజలపై జగ్గారెడ్డి అలిగిన వైనం వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని అడగబోనని జగ్గారెడ్డి చెప్పారు. కానీ, అదే సమయంలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి కోసం పోలీసులతో కొట్లాడిన జగ్గారెడ్డి…ఓ సీఐని, ఓ హోంగార్డును రాయలేని విధంగా బూతులు తిట్టారు.

పోలీసులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లకారాలతో పోలీసులను జగ్గారెడ్డి దూషించిన వైనం వివాదాస్పదమైంది. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలింగ్ బూతులోకి దూసుకువెళ్లిన జగ్గారెడ్డి నానా రచ్చ చేశారు.

బీఆర్ఎస్ రిగ్గింగ్ కు పాల్పడుతోందని, అందుకు సీఐ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలింగ్ ఆపేస్తానని కేకలు వేశారు. ఈ బూత్ లో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే జగ్గారెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలోనే అరే ఎవడ్రా నువ్వు?…రారా…ల…అంటూ లకారాలతో సీఐ శివ కుమార్ ను జగ్గారెడ్డి దుర్భాషలాడారు. ఇక, బీఆర్ఎస్ రిగ్గింగ్ చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఆ అభ్యర్థి చొక్కా పట్టుకొని సీఐ దౌర్జన్యం చేశారని నిప్పులు చెరిగారు.

ఆ సీఐ మగోడైతే ఇక్కడకు రావాలి…అని సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పోలీసులు ఉంటారని, అయినా సరే తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండమని తాను చెప్పలేదని అన్నారు.

ఆ సీఐ బీఆర్ఎస్ తొత్తు అని, ఆ విషయం తనకు తెలుసని, అతడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇదేమన్నా సినిమానా…నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ వా అంటూ ఆ సీఐపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక, సీఐతో పాటు మరో హోంగార్డ్ పై కూడా బూతులతో జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. తాను పోలింగ్ బూత్ లోకి రాక 26 ఏళ్లయిందని…కానీ, ఈ రోజు రావాల్సి వచ్చిందని అన్నారు.

Related Post

Ken Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibeKen Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibe

Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Now, today.makers unveiled the Telugu trailer and

Rashmika Mandanna Unveils Intense Trailer of Roshan Kanakala’s “Mowgli 2025”Rashmika Mandanna Unveils Intense Trailer of Roshan Kanakala’s “Mowgli 2025”

The much-awaited trailer of Mowgli 2025 is finally out, unveiled by National Crush Rashmika Mandanna, and it promises a gripping emotional ride packed with action, love, and raw intensity. Starring