hyderabadupdates.com movies భయపెట్టడమే మైనస్ అయ్యిందా

భయపెట్టడమే మైనస్ అయ్యిందా

గుణశేఖర్ యుఫోరియా రెండో వారంలో అడుగు పెట్టకముందే బాగా స్లో అయిపోయింది. ప్రమోషన్ల పరంగా దర్శకుడు తన వంతుగా ఎంత కష్టపడినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ కావడంలో కంటెంట్ సక్సెస్ కాలేకపోయింది. ఒక సీరియస్ ఇష్యూని పచ్చిగా, నిజాలు అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం కమర్షియల్ గా వర్కౌట్ కావడం లేదు.

కొందరు విమర్శకులకు నచ్చింది. మరికొందరు సోషల్ యాక్టివిస్టులు మెచ్చుకున్నారు. కానీ అవి బాక్సాఫీస్ వసూళ్లకు ఉపయోగపడటం లేదు. పోటీ పెద్దగా లేకపోయినప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో యుఫోరియా తడబడుతోంది. కంటెంట్ గురించి గుణశేఖర్ తాజాగా స్పందించారు.

భయపెట్టేలా సినిమా తీశారని, కొన్నిచోట్ల ఒక హారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని కొందరు తనకు చెప్పారని గుణశేఖర్ వివరించారు. ఇలాంటి సామజిక సమస్యని ఇంత తీవ్రతతో చెబితే తప్ప కనెక్ట్ కాదని, అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇది గుర్తించినా ఆడియన్స్ కి తాను చెప్పాలనుకున్నది ఈ డెప్త్ తో అయితేనే సాధ్యమవుతుందని భావించి సాహసం చేశానని అన్నారు.

నిజమే. కానీ ఫిలిం మేకర్ గా ఆయన ఏదైతే పాజిటివ్ కోణంలో ఆలోచించారో తెరమీదకు వచ్చాక అదే నెగటివ్ గా మారిపోయిన వైనం స్పష్టం. రేప్ రీ కన్స్ ట్రక్షన్ లాంటివి చూపించిన విధానం జనాలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.

తల్లి మీద కొడుకు జుగుప్సాకర చర్యకు ట్రై చేయడం, జైళ్లలో ఉండే దారుణమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చూపించడం, భయపెట్టడంతో పాటు వేరొకరికి రికమండ్ చేయడానికి ఆలోచించేలా చేశాయి.

యుఫోరియా లాంటివి వెబ్ సిరీస్, ఓటిటి మూవీస్ గా వస్తే ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవి వాటిలో సర్వసాధారణం కాబట్టి. కానీ టికెట్లు అమ్మడం ద్వారా బిజినెస్ చేసే సినిమాకు ఇవి అంతగా సూట్ కావు. పైగా బాలీవుడ్ కల్చర్ ఇక్కడ లేదు. ఒకవేళ స్ట్రెయిట్ గా హిందీలో తీసి ఓటిటికి ఇచ్చి ఉంటే రిజల్ట్ మారేదేమో. ఏదైతేనేం యూఫోరియా రూపంలో గుణశేఖర్ లోని మేకర్ కనిపించాడు కానీ కమర్షియల్ డైరెక్టర్ ఇంకా బయటికి రాలేదు.

Related Post

2 Tamil movies to watch on OTT this week: Dulquer Salmaan’s Kaantha to Arjun Sarja’s Theeyavar Kulai Nadunga2 Tamil movies to watch on OTT this week: Dulquer Salmaan’s Kaantha to Arjun Sarja’s Theeyavar Kulai Nadunga

Cast: Arjun Sarja, Aishwarya Rajesh, Ramkumar Ganesan, Praveen Raja, Logu NPKS, Abirami Venkatachalam, Vela Rama Moorthy Director: Dinesh Lakshmanan Genre: Mystery Investigative Thriller Runtime: 2 hours and 7 minutes Where

కుప్పంలో యాపిల్ ఛాసిస్ యూనిట్!కుప్పంలో యాపిల్ ఛాసిస్ యూనిట్!

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. వాస్తవానికి శనివారమే ఏడు కీలక పరిశ్రమలకు చంద్రబాబు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు రానున్నాయి. స్థానికంగా 10