hyderabadupdates.com movies చికిరి వెనుక చరణ్ ఐడియా

చికిరి వెనుక చరణ్ ఐడియా

చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ఈ పాటలోని ఐకానిక్ స్టెప్పుల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లేటెస్ట్ గా ఒక డ్యాన్స్ షోలో బయటపెట్టారు. సాధారణంగా సినిమాల్లో డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కొరియోగ్రాఫర్లే డిజైన్ చేస్తుంటారు. కానీ ఈ పాటలో ఎక్కువగా వైరల్ అయిన ‘బ్యాట్ స్టెప్’ ఐడియా మాత్రం జానీ మాస్టర్‌ది కాదట. 

స్వయంగా రామ్ చరణే ఈ వెరైటీ స్టెప్పును కంపోజ్ చేశారని జానీ మాస్టర్ వెల్లడించారు. బ్యాట్‌ను పట్టుకునే విధానం, ఆ సమయంలో చేసే డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ చరణ్ ఆలోచన నుంచే పుట్టాయని ఆయన వివరించారు. చరణ్ తన ఐడియాను చెప్పడమే కాకుండా, దాన్ని స్వయంగా ప్రాక్టీస్ చేసి జానీ మాస్టర్‌కు చూపించారట. ఆ మూమెంట్స్ చాలా బెటర్ గా ఉంటాయని, ఖచ్చితంగా వర్కవుట్ అవుతాయని చరణ్ నమ్మినట్లు జానీ మాస్టర్ గుర్తు చేసుకున్నారు. 

అయితే ఇంతటి క్రేజీ స్టెప్పును క్రియేట్ చేసినా, చరణ్ మాత్రం ఎప్పుడూ ఆ క్రెడిట్ తీసుకోరట. ఆ క్రెడిట్ అంతా కొరియోగ్రాఫర్లకే ఇచ్చేస్తూ చరణ్ తన గొప్ప మనసును చాటుకుంటారని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇక చివరగా ఎందుకని అడిగితే ఆ స్టెప్ సెట్టవుతుందో లేదో మీకే అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఓకే చేస్తే మీకే ఆ క్రెడిట్ దక్కుతుందని చరణ్ సింపుల్ గా తేల్చేసినట్లు మాస్టర్ అసలు విషయాన్ని చెప్పేశాడు. 

గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కొరియెగ్రఫీ చేసినా పెద్దగా ఆ విషయాన్ని హైలెట్ చేసుకోలేదు. మాస్టర్స్ ఇచ్చిన స్టెప్పులను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళడంలో చిరు టాలెంట్ హై లెవెల్లో ఉంటుంది. ఇక తండ్రికి తగ్గ స్టైల్ లోనే చరణ్ కూడా డ్యాన్స్ లో న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.

బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమాను ఒక పక్కా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు ‘అప్పలసూరి’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఇక ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో చరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Related Post

అప‌ర భ‌గీర‌థుడిగా చింత‌మ‌నేని ..!అప‌ర భ‌గీర‌థుడిగా చింత‌మ‌నేని ..!

ఒక‌ప్పుడు ఆయ‌న నోరు విప్పితే వివాదాలు.. విమ‌ర్శ‌లు.. ఘ‌ర్ష‌ణ‌లు అనే పేరు ఉండేది. కానీ, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న సంపూర్ణంగా మారిపోయారు. వివాదాల జోలికి పోవ‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. ఆయ‌నే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని

Telusu Kada flops; Will Neerraja Kona’s film with Nithiin achieve success?Telusu Kada flops; Will Neerraja Kona’s film with Nithiin achieve success?

The romantic drama Telusu Kada starring Siddu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty ended up as a box office flop. The film, which sparked discussions online, marked the directorial debut