hyderabadupdates.com movies మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా

మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. ఇతరులు ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉన్నారు.

116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 65 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. 53 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించగా…11 స్థానాల్లో బీఆర్ఎస్, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

మొత్తం 414 డివిజన్లకు ఎన్నికలు జరగగా..211 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో, 133 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 22 స్థానాల్లో బీఆర్ఎస్, 22 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

ఇక, మొత్తం 2581 వార్డులకు ఎన్నికలు జరిగగా..2400 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. 1310 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 671 స్థానాల్లో బీఆర్ఎస్, 213 స్థానాల్లో బీజేపీ, 206 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఓవరాల్ గా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది.

Related Post

Mega Rampage at Box Office: Chiranjeevi Film Races Towards ₹225 Crore MarkMega Rampage at Box Office: Chiranjeevi Film Races Towards ₹225 Crore Mark

Megastar Chiranjeevi has once again proved his unmatched box office stamina with Mana Shankara Vara Prasad Garu creating a massive storm at the box office. The film continues its sensational