hyderabadupdates.com movies ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

సుమారు 8.9 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల క్రితం ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వేడుకలకు ముందుగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినట్టుగానే, రెండు రోజుల ముందే రహదారిని ప్రారంభించడం విశేషం.

రహదారిని ప్రారంభించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల నిర్వహణ మరియు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆలయాలు వారసత్వం మరియు పురాతన సంపదకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయాలను పరిరక్షించే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆలయ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు.

పాలక మండళ్లు సరిగా పనిచేసి ఉంటే అలాంటి తప్పులు జరిగి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. అపచారాలు జరగకుండా చూసుకునే బాధ్యత పాలక మండళ్లపైనే ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేశామని, గత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

చంద్రబాబు, ప్రధాని మోడీ నేతృత్వంలో పాలన ప్రారంభమైన నాటి నుంచి ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. జగన్నాథపురంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. 22 ప్రధాన దేవాలయాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌర్ణమికి శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related Post

‘రిజ‌ర్వేష‌న్‌’పై ఏం చేద్దాం..కాంగ్రెస్ నేతల అర్థరాత్రి భేటీ‘రిజ‌ర్వేష‌న్‌’పై ఏం చేద్దాం..కాంగ్రెస్ నేతల అర్థరాత్రి భేటీ

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. అక్టోబ‌రు 9(నేటి నుంచి 8 రోజుల్లో)న నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా ఐదు ద‌శ‌ల్లో న‌వంబ‌రు వ‌ర‌కు ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి అడ్డంకులు

Varanasi glimpse clocks 75 million views in 1 day; Mahesh’s Rudhra entry stuns fansVaranasi glimpse clocks 75 million views in 1 day; Mahesh’s Rudhra entry stuns fans

The first video glimpse of Tollywood Superstar Mahesh Babu and India’s numero uno director SS Rajamouli’s Varanasi has turned out to be a phenomenon across the country. The video has

దేశంలో ఏపీకే ఆ ఘ‌న‌త ద‌క్కింది.. : చంద్ర‌బాబుదేశంలో ఏపీకే ఆ ఘ‌న‌త ద‌క్కింది.. : చంద్ర‌బాబు

దేశంలో ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ఘ‌న‌త ఏపీకి మాత్ర‌మే ద‌క్కింద‌ని, ఇది తెలుగు నేల చేసుకున్న అదృష్ట‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అది క్వాంట‌మ్ వ్యాలీ అని చెప్పారు. దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఈ వ్యాలీకోసం ప్ర‌య‌త్నించాయ‌ని.. కానీ, కేంద్రం స‌హ‌కారంతో