hyderabadupdates.com movies కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా

కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో డిజాస్టర్ చవి చూశాక మళ్ళీ కనిపించలేదు. దాని మీద భారీ నమ్మకం పెట్టుకుంటే అది కనీస స్థాయిలో ఆడకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కేవలం క్లైమాక్స్ నమ్ముకుని ఒక రొటీన్ యాక్షన్ మూవీ ఇవ్వడం ఆడియన్స్ కి నచ్చలేదు.

పోనీ ఆ చివరి ఘట్టమైనా గొప్పగా ఉందా అంటే అది కూడా నిరాశపరిచింది. దీనికన్నా ముందు డెవిల్, అమిగోస్ రూపంలో మరో రెండు ఫ్లాపులు చవి చూసిన కళ్యాణ్ రామ్ నిర్మాతగా దేవర లాంటి ప్రాజెక్టులతో సక్సెస్ చూస్తున్నాడు. కానీ ఎటొచ్చి హీరోగా విజయలక్ష్మిని అందుకోవడమే కష్టంగా ఉంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కళ్యాణ్ రామ్ ఒక కొత్త దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారట. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ కు రచయితగా పని చేసిన శ్రీకాంత్ విస్సాని డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తూ డెబ్యూ ఆఫర్ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చు.

ట్రాక్ రికార్డు పరంగా చూసుకుంటే శ్రీకాంత్ విస్సా రైటర్ గా చెప్పుకోదగ్గ హిట్లకే పని చేశారు. రవితేజ, వెంకటేష్, గోపిచంద్ లాంటి హీరోలకు రచన చేశారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతికు సంబంధించి కీలకమైన ట్విస్టు డిజైన్ చేసింది ఈయనే. అప్పటి నుంచే కళ్యాణ్ రామ్ కు తన మీద మంచి గురి ఉంది. సో ఇప్పటికి కాంబో ఇలా కుదురుతోందన్న మాట.

ఎన్నో నెలల క్రితమే బింబిసార 2 ప్రకటించిన కళ్యాణ్ రామ్ తర్వాత దాని ఊసు తీసుకురాలేదు. వసిష్ఠ నుంచి దర్శకత్వ బాధ్యతలు అనిల్ పాడూరికి ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఈలోగా శ్రీకాంత్ విస్సాతో కలయిక కుదిరినట్టు ఉంది.

ఒకరకంగా చెప్పాలంటే బాగా స్ట్రగులింగ్ ఫేజ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు అత్యవసరంగా హిట్టు పడాలి. ఒకప్పుడు ప్రామిసింగ్ మార్కెట్ ఉండేది కాస్తా ఇప్పుడు డౌన్ అయిపోయింది. సాలిడ్ కంబ్యాక్ ఒకటి ఇస్తే మళ్ళీ పుంజుకుంటుంది కానీ అదే సాధ్యపడటం లేదు. మరి శ్రీకాంత్ విస్సా అయినా కోరుకున్న బ్రేక్ ఇస్తారో లేదో వేచి చూడాలి. అనౌన్స్ మెంట్ ఉగాదికి రావొచ్చు.

Related Post

Naga Chaitanya drops a post amidst Samantha and Raj Nidimoru’s wedding pics going viralNaga Chaitanya drops a post amidst Samantha and Raj Nidimoru’s wedding pics going viral

For the unversed, Samantha Ruth Prabhu and Naga Chaitanya dated for several years and were married in 2017. They announced their separation in 2021, which came as a shock to the fans. Both