hyderabadupdates.com movies ధనుష్ అంత పెద్ద మాట తప్పాడా

ధనుష్ అంత పెద్ద మాట తప్పాడా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ 20 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కేసు వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2016లో ఈయన స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే సినిమా తీయడానికి సదరు ప్రొడక్షన్ హౌస్ ధనుష్ తో ఒప్పందం చేసుకుంది.

కానీ కాలం గడిచిపోతున్నా ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. తర్వాత వేరే దర్శకుడికి ఈ బాధ్యతను అప్పగిద్దామనుకుంటే ధనుష్ ఆ స్క్రిప్ట్ ని ఇవ్వకుండా మరింత కాలాయాపన చేశాడు. దీంతో ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి నష్టపరిహారంగా అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

తమ సినిమాని పక్కనపెట్టి ధనుష్ వరసగా వేరే సినిమాలు చేస్తున్నాడని తేనాండాళ్ అధినేతలు ఆరోపిస్తున్నారు. దీని తర్వాతే ధనుష్ తన డైరెక్షన్ లో రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లి కొట్టు తీశారు. రెండోది తప్ప మిగిలిన వాటిలో ఆయనే హీరో.

కమర్షియల్ గా బాగానే వర్కౌట్ చేసుకున్నాయి. మరి నాన్ రుద్రన్ ని ఎందుకు పక్కన పెట్టారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతానికి ధనుష్ టీమ్ వైపు నుంచి ఈ కాంట్రవర్సి పట్ల స్పందన లేదు. లీగల్ గా అన్ని కోణాలు విశేషించుకున్నాకే రెస్పాన్డ్ అయ్యే అవకాశముంది. అప్పుడప్పుడు ధనుష్ ఇలాంటి వాటిలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.

ఆ మధ్య నయనతారతో కాపీ రైట్స్ విషయంలో జరిగిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం హైలైట్ అయ్యింది. ఇళయరాజా బయోపిక్ ప్రకటించి దాన్ని పెండింగ్ లో ఉంచడం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో బోలెడు డౌట్లను తీసుకొచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా ముందు తేనాండాళ్ ఆరోపణలు ధనుష్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. 

Related Post

నాయకుడి కోసం సెలవు తీసుకున్న నటుడునాయకుడి కోసం సెలవు తీసుకున్న నటుడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు శాశ్వతంగా సెలవు చెప్పేశాడు. ఇకపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకోవడంతో జన నాయకుడు చివరి మూవీ కానుంది. నిన్న మలేషియాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా

Harshith Reddy charms in Deewana love: Story Poster intriguesHarshith Reddy charms in Deewana love: Story Poster intrigues

After marking his big-screen entry with Subham, Harshith Reddy is returning with Deewana, a romantic drama directed by Sreekanth Sangishetty. Backed by producers Vasudev Koppineni and Sridevi Karyampudi under the