hyderabadupdates.com movies బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!

బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!

తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది.

నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు దక్కనివ్వమని నొక్కి చెప్పారు.

“సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. కావాలంటే మేయర్ పీఠం వారికే. కేవలం ఆ రెండు పార్టీలను రాకుండా చూడాలని, సింగరేణి స్కాముల గురించి తాము ఎంత పోరాడుతున్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని, సింగరేణి కోసం తాము కలవాలని” కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనితో ఎలాగో మేయర్ పీఠం వారిదే కాబట్టి బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు చేతులు కలుపుతారని భావించారంతా.

ఇవాళ అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేరు సగం కాలం పాటు పంచుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

‘సింగరేణి స్కాం’ అంటూ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అడ్డుకట్టలా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Post

Sharwanand’s Biker to Skip 3D and 4DX Release? Here’s What ChangedSharwanand’s Biker to Skip 3D and 4DX Release? Here’s What Changed

Charming Star Sharwanand’s sports drama Biker is finally locked to arrive in cinemas on April 3, 2026. Along with this, the makers have also introduced veteran actor Rajashekhar as Bullet

లీకులను పెద్దగా పట్టించుకోని ‘పెద్ది’లీకులను పెద్దగా పట్టించుకోని ‘పెద్ది’

ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి. ఎర్రకోట దగ్గర రామ్ చరణ్ నడుస్తున్న ఫోటోలు టీమ్ వదిలినట్టు అనిపించినా తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మెట్లను