hyderabadupdates.com Gallery ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం post thumbnail image

అమరావతి : ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ. 439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడుకు,టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించిన మంత్రి నారాలోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తున్న బడ్జెట్ గా మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-29 నూతన పర్యాటక పాలసీ రావడం, సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక రంగ ప్రగతికి తాము గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ రాష్ట్రాల్లో రోడ్ షోలు, రీజినల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లు నిర్వహించి 117 ఎంవోయూల ద్వారా రూ. 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. తద్వారా సుమారు 1,22,637 ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం అయ్యిందని అన్నారు కందుల దుర్గేష్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్ గడిచిన ఏడాదిన్నర‌ కాలంలో వస్తోన్న విప్లవాత్మక సంస్కరణలకు ఒక రూపం ఇచ్చే బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల సహకారం అద్భుతంగా ఉందని.. ఇప్పటికే 8 ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల కేంద్ర గ్రాంట్ లభించిందని దుర్గేష్ తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కేంద్ర ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
The post ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వంAP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం (AP Government) కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్యWife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

  ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం