hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ

సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ

సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ post thumbnail image

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్ర‌స్తుతం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. మ‌రో వైపు టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న ఆస్ట్రేలియాను పసికూన‌లు అని భావించిన జింబాబ్వే ఓడించింది. టోర్నీలో ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. ప్ర‌ధానంగా స్టార్ హిట్ట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి అనారోగ్యానికి గుర‌య్యాడు. మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ దంచి కొడుతున్నాడు. మ‌రో వైపు ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు సంజూ శాంస‌న్.
ఈ త‌రుణంలో సౌర‌వ్ గంగూలీ స్పందించాడు. త‌ను శ‌నివారం మీడియాతో మాట్లాడాడు. సంజు సామ్సన్ అద్భుత‌మైన ఆట‌గాడు. ఇప్ప‌టికే గ‌తంలో మూడు సెంచ‌రీలు చేశాడు పొట్టి ఫార్మాట్ లో. స్థిరమైన అవకాశాలకు అర్హుడని పేర్కొన్నాడు. ప‌దే ప‌దే ఛాన్స్ లు ఇచ్చి ఆ త‌ర్వాత తీసి వేస్తే ఏ ఆటగాడూ స్థిర‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించ లేడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు సౌర‌వ్ గంగూలీ. త‌ను ఫామ్ లోకి రావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నాడు. గ‌త ఏడాది లో దుమ్ము రేపాడు. సంజూ శాంస‌న్ కు అపార‌మైన శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు. ఇదిలా ఉండ‌గా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 22 ర‌న్స్ చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఒక ఫోర్ ఉంది.
The post సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తాఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేతో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న 11 ఏళ్ల

9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి

న్యూఢిల్లీ : ప్ర‌స్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణ కార‌ణంగా ప‌లు విమానాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది డీజీసీఏ. శుక్ర‌వారం విమాన‌యాన సంస్థ‌ల‌కు

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసాఅన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అమ‌రావ‌తి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను