hyderabadupdates.com Gallery గ్రూప్ -1 నియామకాల అవ‌క‌త‌వ‌క‌లపై సిట్ ఏర్పాటు

గ్రూప్ -1 నియామకాల అవ‌క‌త‌వ‌క‌లపై సిట్ ఏర్పాటు

గ్రూప్ -1 నియామకాల అవ‌క‌త‌వ‌క‌లపై సిట్ ఏర్పాటు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం ఈ మేర‌కు గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో 2018వ సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన గ్రూప్ -1 నియామ‌కాల‌లో చోటు చేసుకున్న అవ‌కత‌వ‌క‌ల‌పై విచారించేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేర‌కు స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌గిరి లోని సీఐడీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అయ్య‌న్నార్ ను సిట్ అధిప‌తిగా నియ‌మించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఆనాడు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆనాడు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌లో, నియామ‌కాల‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయంటూ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 11న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.
దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు వెలువ‌రించింది. వెంట‌నే నియామ‌కాల‌కు సంబంధించి ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. త‌క్ష‌ణ‌మే జ‌ర‌గాల‌ని ఏపీ కూట‌మి స‌ర్కార్ కు స్ప‌ష్టం చేసింది. దీంతో ఏపీ కూట‌మి స‌ర్కార్ ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ డీజీపీకి త‌క్కువ కాని అధికారిని నిమించాల‌ని జారీ చేసిన ఆదేశాల‌లో పేర్కొంది కోర్టు. ఇంప్లీడ్మెంట్ కోసం రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కి మూడు రోజుల్లోపు సిట్ ​​వివరాలను అందించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా తాజాగా హైకోర్టు వెలువ‌రించిన తీర్పు క‌ల‌క‌లం రేపుతోంది రాష్ట్రంలో.
The post గ్రూప్ -1 నియామకాల అవ‌క‌త‌వ‌క‌లపై సిట్ ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టురుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. కోట్లాది మంది బాలిక‌లు, యువ‌తులు, మహిళ‌లు ప్ర‌తి నెలా మెన్స‌స్ తో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతారు. ప్ర‌త్యేకించి బాలిక‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. ప్ర‌త్యేకించి నెల నెలా

ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌

ISRO Chief Narayanan : అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి

1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం

ములుగు జిల్లా : ఈసారి జ‌రిగిన మేడారం జాత‌ర‌ను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు. త‌ను మంత్రి దాస‌రి సీత‌క్క‌తో క‌లిసి ప‌ర్య‌టించారు మేడారాన్ని. ఈ సందర్భంగా