hyderabadupdates.com movies లేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమ

లేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమ

నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చింది. స్టార్ల సరసన సినిమాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె కెరీర్ దాదాపుగా ఆగిపోయినట్లే కనిపించింది.

కానీ ఈ మధ్య మళ్లీ ఆమె తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతున్న పరిస్థితుల్లో నయన్, త్రిష లాంటి వాళ్ల వైపే చూస్తున్నారు వారితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు. ఇటీవలే సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా నటించి మెప్పించింది నయన్.

40 ప్లస్ వయసులోనూ అందం, గ్రేస్‌తో ఆకట్టుకున్న నయన్.. పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టింది. ఈ సినిమాకు ఆమె ప్రమోషన్లలో కూడా సహకరించడం విశేషం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంత పెద్ద సక్సెస్ కావడంతో టాలీవుడ్లో నయన్ క్రేజ్ పెరిగింది. అలాగే నయన్‌కు కూడా తెలుగు సినిమాలపై ప్రేమ పెరిగినట్లుంది. వెంటనే ఆమె ఇక్కడ ఇంకో సినిమా అంగీకరించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమాలోనూ నయనే కథానాయికగా ఖరారైనట్లు సమాచారం.

బాలయ్య, నయన్‌లది ప్రత్యేకమైన కాంబినేషన్. వీరి కలయికలో సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. మూడూ విజయవంతం అయ్యాయి. ‘జైసింహా’ వచ్చిన ఏడెనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీని తెరపై చూడబోతున్నాం. ముంబయి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. వెంకట సతీష్ కిలారుతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. తమన్ సంగీతం అందిస్తాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

Related Post

Naresh VK’s Birthday Brings Special Surprise as ‘Crazy Kalyanam’ Poster Is UnveiledNaresh VK’s Birthday Brings Special Surprise as ‘Crazy Kalyanam’ Poster Is Unveiled

The makers of the upcoming Telugu entertainer Crazy Kalyanam have released a special birthday poster of versatile actor Dr. Naresh VK, creating excitement among fans and film lovers. The poster

Sky Trailer Promises a Refreshing Love Story Ahead of February 6 ReleaseSky Trailer Promises a Refreshing Love Story Ahead of February 6 Release

The trailer of the upcoming romantic entertainer Sky has been released today and is already creating a pleasant buzz among movie lovers. Featuring Murali Krishnam Raju, Shruti Shetty, and Anand