hyderabadupdates.com movies రవితేజ సినిమా.. అన్నీ సాహసాలే

రవితేజ సినిమా.. అన్నీ సాహసాలే

మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత ఆయనకు విజయమే లేదు. ఆ తర్వాత ఆయన హీరోగా ఏడు సినిమాలు వచ్చాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ యావరేజ్ అనిపించుకుంది. అంతకుముందు సినిమాలన్నీ డిజాస్టర్లే.

ఐతే తాను ఎంతో నమ్మకం పెట్టుకున్న మాస్ సినిమాలే తన కొంప ముంచేస్తుండడంతో ‘మాస్ రాజా’ ట్యాగ్ పక్కన పెట్టి ఇమేజ్‌కు భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అందులో భాగమే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. గత చిత్రాలతో పోలిస్తే దాని రిజల్ట్ కూడా బెటరే. దీని తర్వాత అందరికీ పెద్ద షాకిస్తూ ‘ఇరుముడి’ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు రవితేజ. అయ్యప్ప స్వామి మాల ధరించే నేపథ్యంలో రవితేజ సినిమా చేయడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం.

రవితేజ లాగే ఫెయిల్యూర్లతో బాధ పడుతున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అతడికీ ఇది పూర్తి భిన్నమైన సినిమానే. సక్సెస్ కోసం చాలా డెస్పరేట్‌గా ఉన్న ఈ ఇద్దరూ.. తమ లాగే కాలం కలిసి రాని హీరోయిన్ని ఈ చిత్రం కోసం ఎంచుకున్నారు. ఆమే.. ప్రియ భవాని శంకర్. తమిళంలో కెరీర్ ఆరంభంలో ‘మెయ్యాదమన్’ సహా కొన్ని హిట్లు పడ్డాయి ప్రియకు. కానీ తర్వాత వరుసగా ఫెయిల్యూర్లే ఎదురయ్యాయి. తెలుగులో మూడు సినిమాలు చేసిన ప్రియకు ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర పడింది.

సంతోష్ శోభన్ సరసన నటించిన ‘కళ్యాణం కమనీయం’, గోపీచంద్‌కు జోడీగా నటించిన ‘భీమా’, సత్యదేవ్ పక్కన చేసిన ‘జీబ్రా’ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో తర్వాత ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అతి పెద్ద అవకాశం ఆమెను పలకరించింది. రవితేజ లాంటి స్టార్ సరసన అవకాశం దక్కింది. మరి దీన్ని ఆమె ఎంతమేర ఉపయోగించుకుంటుందో.. హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఇంతమందికి ‘ఇరుముడి’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Related Post

డెకాయిట్ చేసింది తెలివైన పనేడెకాయిట్ చేసింది తెలివైన పనే

టాక్సిక్ తప్పుకుని మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు డెకాయిట్ గురించిన చర్చ మూవీ లవర్స్ మధ్య జరుగుతోంది. అసలు అందరికంటే ముందుగా ఈ డేట్ మీద కన్నేసింది అడివి శేష్. అధికారికంగా ప్రకటన ఇచ్చి

ఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలుఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలు

ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.