hyderabadupdates.com movies బలవంతంగా టైటిల్స్ మార్పిస్తే ఎలా

బలవంతంగా టైటిల్స్ మార్పిస్తే ఎలా

అదేంటో కొత్తగా సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ల పర్వం టైటిల్స్ దగ్గరే మొదలు పెడుతోంది. మొన్నటికి మొన్న కపుల్ ఫ్రెండ్లి విషయంలో ఇలాగే జరిగి నిర్మాణ సంస్థ ఏ సర్టిఫికెట్ తీసుకోవడం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. దాని వల్లే కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారని డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మాటలతో పూర్తిగా ఏకీభవించలేం కానీ పేర్ల ప్రభావమైతే ఆడియన్స్ మీద ఉంటుంది.

తాజాగా సుహాస్ హీరోగా రూపొందిన ‘హే భగవాన్’కు ఇదే సమస్య రావడంతో సెన్సార్ అభ్యంతరం మేరకు దాన్ని ‘హే బలవంత్’గా మార్చేశారు. పనికి తగ్గట్టే పేరు కూడా బలవంతంగా మార్పించిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

మొన్నటి డిసెంబర్ లో ‘వానర’ టైటిల్ ని ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. దీంతో జనాల్లో పేరు ప్రాపర్ గా రిజిస్టర్ కాక చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్నా సరే ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యింది. అప్పుడెప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నరేష్ ‘పోలీసోడి పెళ్ళాం’ని ‘పోలీస్ భార్య’గా మార్చినా, నాగబాబు ‘దాదర్ ఎక్స్ ప్రెస్’ పేరుని ‘సూపర్ ఎక్స్ ప్రెస్’గా ఛేంజ్ చేయాల్సి వచ్చినా అదంతా సెన్సార్ వల్లే అన్నది బహిరంగ రహస్యం.

1992లోనే నరేష్ వేరే సినిమాలు హలో డార్లింగ్ లేచిపోదామాని హలో డార్లింగ్ గా, పెళ్లి నీకు శోభనం నాకుని పెళ్లి నీకు శుభం నాకుగా మార్చినా సెన్సార్ వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు.

వర్తమానానికి వస్తే ప్రమోషన్లలో ఒక టైటిల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక హఠాత్తుగా మార్చడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా పబ్లిసిటీ పెద్ద సమస్య అయిపోయింది. దీని వల్ల వసూళ్లు దెబ్బ తింటున్నాయని వాళ్ళు వాపోతున్నారు.

పైన చెప్పిన ఉదాహరణల్లో చాలా మటుకు అసలే కాంట్రావర్సి లేని కంటెంట్లు. కానీ సున్నిత మనోభావాలను, సామజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు మరీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. ట్రైలర్ తో అటెన్షన్ లోకి వచ్చిన హే భగవాన్ అలియాస్ హే బలవంత్ ఈ ఫిబ్రవరి 20 విడుదల కానుంది.

Related Post

సూర్య సినిమాలో ర‌వితేజ కొడుకు!సూర్య సినిమాలో ర‌వితేజ కొడుకు!

హీరోల కొడుకులు సాధార‌ణంగా హీరోలే అవుతారు. మాస్ రాజా త‌న‌యుడు మహాధ‌న్ మొదట న‌ట‌న‌లోకే అడుగు పెట్టాడు. త‌న తండ్రి న‌టించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్న‌ప్ప‌టి ర‌వితేజ పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు ఆ కుర్రాడు. కానీ త‌ర్వాత అత‌ను మ‌రే

Telusu Kada is a never-before-seen love story – Siddhu JonnalagaddaTelusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda

Star Boy Sidhu Jonnalagadda starrer Telusu Kada has created good anticipation with the blockbuster songs of S Thaman and teaser, trailer have captured the imagination of all audiences. Now, Siddhu

రజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడురజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయడం కంటే గొప్ప అవకాశం ఏముంటుంది. అందులోనూ కమల్ హాసన్ నిర్మాతగా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కొద్దిరోజుల క్రితం సుందర్ సి దర్శకత్వంలో ఈ కాంబో నుంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ