hyderabadupdates.com movies టాక్సిక్ మనసులో అసలు ఏముందో

టాక్సిక్ మనసులో అసలు ఏముందో

ఇంకో మూడు రోజులు దాటితే టాక్సిక్ విడుదల కేవలం నెల రోజుల్లో ఉంటుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఎలాంటి సౌండ్ లేకపోవడం చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దురంధర్ 2 లాంటి పోటీని ఎదురుగా పెట్టుకుని నిర్లిప్తంగా ఉండటం ఎంత మాత్రం సేఫ్ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే జన నాయకుడు వాయిదాల వల్ల నిర్మాణ సంస్థ కెవిఎన్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం వల్ల టాక్సిక్ పబ్లిసిటీ ఇంకా మొదలుకాలేదని చెన్నై టాక్. కానీ బెంగళూరు వర్గాలు వేరే వెర్షన్ వినిపిస్తున్నాయి. యష్ ఇలాంటి విషయాల్లో ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండడని, వేరే ప్లాన్ అమలవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం టాక్సిక్ మీద పలు వివాదాలున్నాయి. బెంగళూరు దగ్గరలో ఒక అటవీ ప్రాంతాన్ని చదును చేయడం, టీజర్ లో ఒక సామజిక వర్గానికి చెందిన స్మశాన వాటిక బయట కారులో ఇంటర్ కోర్స్ జరిగినట్టు చూపించడం, బోల్డ్ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారని పలువురు మహిళా కమీషన్ ని ఆశ్రయించడం లాంటి పరిణామాలు టాక్సిక్ టీమ్ మీఠా ఒత్తిడి పెంచాయి.

ఇప్పుడప్పుడే ప్రచారాన్ని మొదలుపెడితే మరిన్ని వర్గాలు కాంట్రవర్సీ కోసం బయటకి వస్తాయనేది యష్ ఆలోచనగా చెబుతున్నారు. దీన్ని నివారించాలంటే ఇంకొద్ది రోజులు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట.

మొత్తానికి టాక్సిక్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. తెలుగులోనూ దిల్ రాజు పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో బయ్యర్లు కూడా ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఖచ్చితంగా కెజిఎఫ్ కు ఏ మాత్రం తగ్గని టాక్ తెచ్చుకోవాలి.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అయితే ఆ భరోసాని ఇస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేనిదే ఇంత బడ్జెట్ రికవర్ కావడం మీద అనుమానాలు తలెత్తుతున్న మాట వాస్తవం. ఈ డిస్కషన్లకు చెక్ పడాలి అంటే వీలైనంత త్వరగా ట్రైలర్ లాంచ్ జరిగిపోవాలి. ఈ నెలాఖరులో ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. చూడాలి మరి.

Related Post

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది. అయితే ఈ సర్వే క్షేత్రస్థాయిలో నిర్వహించిందికాదు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా మాత్రమే వారి ఆస్తులను అంచనా

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదుతెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే ముద్ద దిగని వారి పరిస్థితి ఏమిటంటారా? ఖరీదు ఎక్కువైనా మటన్ షాపులకు దారి తీయడమొక్కటే మార్గం. అయితే చికెన్ ముక్కకు