hyderabadupdates.com movies విశ్వక్‌ను విశ్వకే కాపాడుకోవాలి

విశ్వక్‌ను విశ్వకే కాపాడుకోవాలి

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోగా విజయాలు అందుకోవడం, స్టార్ ఇమేజ్-ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి అరుదైన ఘనతను అందుకున్న వాళ్లు.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేయకపోవడం, సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్.. ఇలాగే ఇప్పుడు తడబడుతున్నారు.

విశ్వక్ విషయానికి వస్తే.. పెద్దగా జనాల దృష్టిలో పడని తన డెబ్యూ మూవీ ‘వెళ్ళిపోమాకే’ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో అతను యూత్ ఫేవరెట్‌గా మారాడు. హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం, గామి లాంటి చిత్రాలతో చాలా మంచి పేరు సంపాదించాడు. కానీ రెండేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా చిత్రాలతో ఆల్రెడీ హ్యాట్రిక్ ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న అతడికి.. లేటెస్ట్ ఫిలిం ‘ఫంకీ’ కూడా ఉపశమనాన్ని ఇవ్వలేదు.

మంచి అంచనాలతో వచ్చిన ‘ఫంకీ’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రి రిలీజ్ బజ్ వల్ల ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. నెగెటివ్ టాక్, రివ్యూలు సినిమాను గట్టి దెబ్బే తీశాయి. సోమవారానికి థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. విశ్వక్ ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయినట్లే.

ఒకప్పుడు ఎంతో ప్రామిసింగ్ సినిమాలు చేసిన విశ్వక్.. జడ్జిమెంట్ లోపంతోనే వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్నాడన్నది స్పష్టం. మొదట్లో నువ్వు చేసిన సినిమాలేంటి.. ఇవేంటి అంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్లు తన మార్కెట్‌‌ను, ప్రేక్షకుల్లో నమ్మకాన్ని బాగానే దెబ్బ తీసినట్లు కనిపిస్తున్నాయి. ఇకపై చేసే సినిమాల విషయంలో అతను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. 

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది-2’తో పాటు స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కల్ట్’ మీదే తనతో పాటు తన ఫ్యాన్స్ ఆశలూ నిలిచి ఉన్నాయి. ‘ఈఎన్ఈ-2’కి మంచి హైపే ఉంది. అది విశ్వక్‌కు ఉపశమనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

కానీ దాని రిలీజ్ లేటయ్యేలా ఉంది. అంతకంటే ముందే ‘కల్ట్’ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు విశ్వక్. తన కెరీర్‌ను నిలబెట్టే బాధ్యతను తనే తీసుకున్న విశ్వక్.. ‘కల్ట్’తో నిజంగానే కల్ట్ మూవీ ఇస్తాడేమో చూడాలి.

Related Post

విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్‌ ద్వారా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు

Pinkvilla Recommendations: 5 must-watch South films on OTT for a cozy Christmas 2025Pinkvilla Recommendations: 5 must-watch South films on OTT for a cozy Christmas 2025

Cast: Nivin Pauly, Anoop Menon, Nikki Galrani, Joy Mathew, Srinda Arhaan, Jacob Gregory, Saiju Kurup Director: Abrid Shine Genre: Coming-of-Age Sports Drama Where to watch: SunNXT 1983 is a Malayalam