hyderabadupdates.com movies అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

70 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవ‌ల మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు చిత్రంతో మెగా ఫ్యాన్స్ క‌ర‌వు తీర్చేశారు చిరు. ఆ సినిమాలో ఆయ‌న కామెడీ టైమింగ్, డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఐతే ఈ విజ‌యోత్సాహంలో ఉండ‌గా.. ఇటీవ‌ల చిరు భుజానికి స‌పోర్ట్ పౌచ్ స్లింగ్ ధ‌రించ‌డం చూసి ఫ్యాన్స్ కంగారు ప‌డ్డారు. చిరుకు ఏమైందా అని ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డ‌డం చూసి చిరు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. 

తాను భుజానికి స‌పోర్ట్ పౌచ్ స్లింగ్ ధ‌రించ‌డం చూసి త‌న శ్రేయోభిలాషులు, అభిమానులు చాలామంది త‌న‌ను విచారించార‌ని.. త‌న భుజానికి చిన్న శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని.. దాన్నుంచి కోలుకుని దైనందిన కార్య‌క్ర‌మాల్లో కూడా య‌ధావిధిగా పాల్గొంటున్నాన‌ని చిరు తెలిపారు.

త‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయ‌డంతో పాటు జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న డాక్ట‌ర్ నితిన్ మీద చిరు ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ వైద్యుడితో క‌లిసి ఉన్న ఫొటోను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు చిరు. త‌న ప‌ట్ల అభిమానం చూపించి, ఆశీర్వాదాలు ఇచ్చిన వాళ్లంద‌రికీ చిరు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఓవైపు మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం, ఇంకోవైపు చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు పుట్ట‌డంతో చిరు అమితానందంలో ఉన్నారు. త‌న కొత్త సినిమా మొద‌లుపెట్టేముందు చిరు కొంత విరామం తీసుకున్నారు.

వాల్తేరు వీర‌య్య త‌ర్వాత‌ బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించ‌బోయే సినిమాకు స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో చిరు న‌డి వ‌య‌స్కుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు, ఆయ‌న కూతురి పాత్ర‌లో మ‌ల‌యాళ యువ న‌టి అన‌స్వ‌ర రాజ‌న్ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Related Post

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కేవలం సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్ స్లిప్ అయినా చాలు ఆ వీడియోని పట్టుకుని వైరల్ చేయడానికి కొన్ని వందల హ్యాండిల్స్ కాచుకుని ఉంటాయి. లిటిల్ హార్ట్స్,

రాజాసింగ్ చెప్పిందే నిజమైందా?రాజాసింగ్ చెప్పిందే నిజమైందా?

“తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం.” ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండాపోయింది. కేవలం ఒకరిద్దరు నాయకుల మధ్య బంధీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో