hyderabadupdates.com movies ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి నుంచి ఆయన వాహనం కదిలిన వెంటనే మిగతా వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జక్కంపూడి రాజా సహా వైఎస్ఆర్సిపి నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంబటి రాంబాబు వాహనం దిగి వెనక్కి వచ్చారు. అనంతరం పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఇలాంటి చర్యలు సరికాదని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా తమను ఏమి ఇబ్బంది పెట్టగలరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరు దారుణమని ఆరోపించారు.

“నేను ర్యాలీగా వెళ్తే సెక్షన్ 30 వర్తిస్తుందా? నా ఇంటిని పగలగొట్టినప్పుడు సెక్షన్ 30 ఎక్కడుంది? ఆ రోజున నిబంధనలు ఏమయ్యాయి?” అంటూ ప్రశ్నించారు. రాజమండ్రి జైలు నుంచి పలువురు నేతలు ర్యాలీగా వెళ్లలేదా అని నిలదీశారు. అనుమతిస్తే కారులో వెళ్తానని, లేదంటే పాదయాత్రగా వెళ్తానని ప్రకటించారు. కొంతదూరం ఆగ్రహంతో నడుచుకుంటూ వెళ్లారు.

గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీగా రావొద్దని పోలీసుల నుంచి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, అంబటి రాంబాబు వెంట భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Post

Dil Raju and Anand Deverakonda Praise ‘Santhana Prapthirasthu’ TrailerDil Raju and Anand Deverakonda Praise ‘Santhana Prapthirasthu’ Trailer

The trailer of ‘Santhana Prapthirasthu’ was launched in a grand event held in Hyderabad, attended by renowned producer Dil Raju and talented young actor Anand Deverakonda. The film features Vikranth

6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan

Cast: Vinod Sharma, Sahil Vaid, Saumya Daan, Annamaya Verma Creator: Anu Sikka Genre: Animated Mythological Epic Runtime: 9 Episodes Where to watch: Netflix Streaming date: October 10, 2025 Originally in