hyderabadupdates.com movies క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేష్ కొలంబోకు వెళ్లాలా? ఇంట్లో టీవీలో చూస్తే సరిపోదా అంటూ జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలా ప్రైవేటు విమానాలలో జల్సాలు చేసిన సందర్భాలున్నాయా అని జగన్ ప్రశ్నించారు. లోకేశ్ క్రికెట్ అభిమాని అని, టీవీలో మ్యాచ్ చూస్తే కనపడదా అని వెటకారంగా మాట్లాడారు. పైగా, తాను కూడా టీవీలోనే ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూశానని సెలవిచ్చారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

ఈ క్రమంలోనే జగన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ వ్యవహారంపై లోకేశ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారని, ఆ విషయం మరచిపోయి జగన్ మళ్లీ విమర్శించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఏకిపారేస్తున్నారు.

ఆ ప్రైవేటు విమానం ఖర్చు, ఆ క్రికెట్ మ్యాచ్ టికెట్ ఖర్చు అన్నింటికీ తన దుడ్డే వాడానని లోకేశ్ చెప్పినా జగన్ కు అర్థం కాలేదని ట్రోల్ చేస్తున్నారు. అయినా, టీవీలో లైవ్ మ్యాచ్ చూడడానికి, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించడానికి ఉన్న తేడా క్రికెట్ అభిమానులకు మాత్రమే తెలుస్తుందని, జగన్ మాదిరిగా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడేవారికి, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేవారికి అర్థం కాదని సెటైర్లు వేస్తున్నారు.

“కొలంబోలో క్రికెట్ మ్యాచ్ జరిగితే అక్కడికి వెళ్ళే చూడాలా? టీవీ లో చూడొచ్చుగా?నేను కూడా టీవీలోనే చూశా మ్యాచ్.”– #YsJagan about #NaraLokesh pic.twitter.com/2dSNEFIJUh— Gulte (@GulteOfficial) February 19, 2026

Related Post

Suman Unveils Powerful Trailer of “RK Deeksha” at Grand Launch EventSuman Unveils Powerful Trailer of “RK Deeksha” at Grand Launch Event

The trailer of “RK Deeksha”, produced and directed by Dr. Pratani Ramakrishna Goud under RK Films and Sigdha Creations, was launched in a grand event by veteran actor Suman. Presented

బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!

“ఫ‌లానా వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయండి.. ఫ‌లానా పార్టీతో చేతులు క‌ల‌పండి!“ అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ఎవ‌రికీ చెప్పిన‌ట్టు లేదు. ఒక‌వేళ చెప్పినా.. ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లు కూడా చేసింది లేదు. కానీ, తొలిసారి ఏపీలోని