hyderabadupdates.com Gallery ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు

ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు

ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు post thumbnail image

ముంబై : త‌న భ‌ర్త‌, దివంగ‌త మ‌రాఠా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హారాజ్ బాట‌లో న‌డిచార‌ని అన్నారు భార్య, ఉప ముఖ్య‌మం్త‌రి సునేత్ర ప‌వార్. గురువారం ఛ‌త్ర‌ప‌తి జ‌యంతి సంద‌ర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా త‌న భ‌ర్త గురించి త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. చత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, జ్యోతిరావు గోవిందరావు ఫూలే, బిఆర్ అంబేద్కర్ ల ఆదర్శాల ప్రకారం ఆయన జీవించారని అన్నారు. ఈ రోజు ఆత్మగౌరవం, స్వరాజ్యం, సుపరిపాలన పట్ల సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి చెందినదని అన్నారు.
నేను ఉప ముఖ్య‌మంత్రిగా సవాలుతో కూడిన సమయంలో ప్రమాణం చేశానని చెప్పారు. ఆ సమయంలో, జీజామాత నా కళ్ళ ముందు ఉంది. జీజామాత శివాజీ మహారాజ్‌కు జన్మనివ్వడమే కాకుండా, స్వరాజ్యాన్ని ఎలా స్థాపించాలో, ధైర్యంగా సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిందని అన్నారు సునేత్ర ప‌వార్. ఇది మిమ్మల్ని, నన్ను ఇద్దరినీ నడిపించే ప్రేరణ, ఇది మా పునాది కూడా అని పేర్కొన్నారు. తన జీవితాంతం అజిత్ పవార్ శివ, షాహు, ఫులే , అంబేద్కర్ ఆదర్శాల ఆధారంగా ముందుకు సాగారు. ఈ పవిత్ర భూమి నుండి నేను ఈ భావజాలం వారసత్వాన్ని ఎప్పటికీ వదులుకోనని నేను మీకు ఈ రోజు హామీ ఇస్తున్నానని ప్ర‌క‌టించారు సునేత్ర ప‌వార్. ప్రజలతో ఆయనకున్న అనురాగ బంధం చాలా బలమైనది, అంతే కాదు విడ‌దీయ రానిద‌న్నారు.
The post ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులుBengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

  బెంగళూరు ఏటీఎం వ్యాన్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు… కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలుDelhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తేదీన కారు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్ ఉన్ నబీ అనే డాక్టర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన

Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపానుCyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను

    ఆంధ్రప్రదేశ్‌కి తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తుంది. ఇది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీనితో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28,