hyderabadupdates.com Gallery 100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్ post thumbnail image

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ కార్పొరేట్ల‌కు వంతం పాడుతూ కీల‌క‌మైన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి తూట్లు పొడి చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ యాత్ర గురువారం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం వేల్పూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులంతా హాజరయ్యారు. కరువు పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. మోదీ పాలనలో ఏనాడు కూడా 100 రోజుల పాటు పని ఇవ్వలేదని వాపోయారు. తమ గ్రామంలో 20 రోజులు పని ఇచ్చిందే ఎక్కువని, చేసిన పనికి సైతం వేతనాలు గడువు ప్రకారం చెల్లించలేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిల‌తో కూలీలు. కరువు పనిపైనే బ్రతికే వారి కార్డులు చెప్పాపెట్టకుండా తొలగించారని గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికులు లక్ష్మమ్మ, పుల్లారెడ్డి, దేవయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ తెచ్చిన కొత్త పథకం VB G- RAM G చట్టం వద్దని రచ్చబండ వేదికగా గ్రామస్థులంతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అమలు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన ఉపాధి హామీ ప‌థ‌కం వ‌ల్ల గ్రామసభలోనే పనుల నిర్ణయం జరిగేదన్నారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే పని ఇచ్చే వార‌ని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి గ్యారంటీ ఇవ్వబడిందన్నారు. కూలీలకు వేతనం 14 రోజుల లోపు అని నిర్ణయించార‌ని తెలిపారు. ఆడ – మగ అనే తేడాలేకుండా సమాన కూలి చెల్లించడం జరిగిందన్నారు. యంత్రాల వాడ‌కాన్ని నిషేధం విధించార‌ని తెలిపారు ష‌ర్మిల‌. కూలీల వేత‌నాలు వంద శాతం కేంద్ర‌మే ఇచ్చేద‌న్నారు. మ‌రో వైపు మోదీ తీసుకు వ‌చ్చిన వీబిజీ రామ్ జీ చ‌ట్టంలో పైవాటికి పూర్తిగా తూట్లు పొడిచారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ష‌ర్మిలా రెడ్డి.
The post 100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపుసీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం

22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్

అమరావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.