hyderabadupdates.com movies తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను వెలికి తీసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ 45 రోజుల్లో అన్ని వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ వెనుక కుట్రలను బయటకు తీసుకురావడంతో పాటు, టీటీడీ పాలనలోని లోపాలను, టెండర్ల వ్యవహారాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిషన్‌కు సూచించారు.

రీజన్ ఏంటి?

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సుమారు 15 నెలల పాటు అన్ని కోణాల్లో పరిశీలించి తన చార్జ్ షీట్‌ను నెల్లూరు కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అసలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడంపైనే ప్రభుత్వం ఇప్పుడు కమిషన్ ద్వారా నిగ్గు తేల్చాలని నిర్ణయించింది.

దీంతో పాటు వైసీపీ హయాంలో తిరుమల టెండర్లను ఇష్టానుసారంగా మార్చడం, నిబంధనల్లో మార్పులు చేయడంపై గత కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో మనీ లాండరింగ్ కోణంలోనూ సీబీఐ అధికారులు నిర్దిష్టంగా విచారణ చేయలేదని అభిప్రాయం ఉంది. అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం, 10 శాతానికి పైగా కలిసినట్లు ఆనవాళ్లు లేవని చెప్పడం వంటి అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

Related Post

ట్యాపింగ్ కేసు… హరీశ్ తర్వాత కేటీఆర్ వంతుట్యాపింగ్ కేసు… హరీశ్ తర్వాత కేటీఆర్ వంతు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, నైనీ కోల్ బ్లాక్ టెండర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, దాని గుట్టు రట్టు చేసినందుకే హరీశ్ రావుకు హుటాహుటిన

OTT: War 2 makes a stunning digital debut as India’s most-watched film last weekOTT: War 2 makes a stunning digital debut as India’s most-watched film last week

Hrithik Roshan and NTR’s high-budget spy action thriller War 2 didn’t achieve the desired level of success in theatres. However, the biggie made a smashing debut on OTT following its