hyderabadupdates.com Gallery మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్

మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్

మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్ post thumbnail image

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్ తీసిన మూవీ టాక్సిక్. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక య‌ష్ త‌న సినీ కెరీర్ లో ఇది మ‌రిచి పోలేని సినిమాగా ఉండ‌బోతోంద‌ని పేర్కొన్నాడు. భారీ ఖ‌ర్చుతో పాటు అందాల తార‌లు ఇందులో కీ రోల్ పోషిస్తుండ‌డం విశేషం. హాలీవుడ్ ను త‌ల‌పింప చేసేలా ద‌ర్శ‌కురాలు టాక్సిక్ ను తీర్చిదిద్దారు. ఈ మూవీ వ‌చ్చే మార్చి నెల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేజీఎఫ్ ప్రాజెక్టు త‌ర్వాత య‌ష్ నుంచి వ‌స్తున్న బిగ్ బ‌డ్జెట్ మూవీ ఇది . దీంతో ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇక ప‌లు అవార్డుల‌తో పాటు ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్. టేకింగ్, మేకింగ్ లో ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.
ఇక టాక్సిక్ మూవీ గురించి సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టికే టాక్సిక్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధంగా ఉంది. ఇక టాక్సిక్ చిత్రం టీజర్ చివరకు వచ్చింది. గతంలో కంటే క్రూరంగా, అనూహ్యంగా ఉంటాడని సూచిస్తుంది. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది, ట్రైలర్‌లో ఈ సంఘర్షణ స్వభావాన్ని మనం ఎక్కువగా చూస్తామా? వేచి చూడాల్సి ఉంది. జనవరి 8న యష్ పుట్టినరోజును పురస్కరించుకుని మొదటి అధికారిక పోస్టర్‌ను షేర్ చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై వెంకట్ కె. నారాయణ , యష్ నిర్మించారు. నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా , రుక్మిణి వసంత్ నటించిన చిత్రం మార్చి 19న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
The post మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందుSuper Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు

    కార్తీక పౌర్ణమి వేళ… ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్ ఏర్పడింది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావుMLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

  ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన