hyderabadupdates.com Gallery బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : టాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టులు విస్తృతంగా వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఎవ‌రికి వారు వివిధ రంగాల‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీస్తున్న వార‌ణాసిలో న‌టిస్తున్నాడు. త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ , ప్రియాంక చోప్రా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న స్వంత వ్యాపారంలో భాగంగా ఏఎంబీ పేరుతో ఐమాక్స్ థియేట‌ర్ల‌ను ప్లాన్ చేశాడు. హైద‌రాబాద్ లో ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. భారీ లాభాల‌ను తెచ్చి పెడ‌తోంది. ఈ త‌రుణంలో త‌న వ్యాపారాన్ని ఇత‌ర మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌కు కూడా విస్త‌రింప చేశాడు.
ఇందులో భాగంగా క‌ర్ణాట‌క రాజధాని బెంగ‌ళూరులో ఏఎంబీ థియేట‌ర్ ను ఓపెన్ చేశాడు. ఇది హాట్ టాపిక్ గా మారింది సినీ వ‌ర్గాల‌లో. మహేష్ బాబు ప్రస్తుతం తన అద్భుతమైన చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రో వైపు వ్యాపారంపై ఫోక‌స్ పెట్టాడు. బెంగళూరులో తన ప్రతిష్టాత్మక థియేటర్ ని ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి వ్యక్తిగతంగా హాజరవుతున్న‌ట్లు సినీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. అయితే అధికారికంగా గ‌త జ‌న‌వ‌రి నెల 16న లాంచ్ అయ్యింది. మ‌హేష్ బాబు కు చెందిన థియేట‌ర్ బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ ప‌ట్ట‌ణం గాంధీ న‌గ‌ర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది అత్యాధునిక స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు 600 మంది కూర్చునేలా దీనిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఆసియా సినిమా స్ తో క‌లిసి త‌న వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టాడు ప్రిన్స్.
The post బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ?Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ?

Justice Surya Kant : భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ (BR Gavai) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన

Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలుAadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

    ఆధార్‌ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ